చీకట్లు చీల్చి వెలుగులు విరజిమ్మే వేడుక దీపావళి పండుగ
జగిత్యాల అక్టోబర్ 19 (ప్రజా మంటలు)
చీకట్లను చీల్చి వెలుగులు మిరజిమ్మే వేడుకే దీపావళి పండుగ సోమవారం దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక కథనం. ఎటుచూసినా దీపాల సొబగులతో
అంబరాన్నంటే సంబరాలతో హైందవులు దీపావళి పండుగను జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హిందువులంతా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకొనేది దీపావళి వేడుకలు
ఆశ్వీయుజ త్రయోదశి, చతుర్దశి, అమావాస్య,, ఈ మూడు రోజులకు అత్యంత ప్రాధాన్యం ఉంది సనాతన ధర్మంలో ఆశ్వీయుజ మాస కృష్ణపక్ష త్రయోదశి ధన త్రయోదశి, నరకచతుర్దశి, అమావాస్య ఈ మూడు రోజుల్లో సాయంకాల సమయాన దీపాలను ఇంటి వద్ద, ఆలయాల వద్ద, గోశాల వద్ద వెలిగించడం లక్ష్మీ ప్రదం భాద్రపదమానం లో మొదలయ్యే పితృదేవతారాధనకు ఈ దీపావళితో దీపాల ద్వారా వీడ్కోలు పలకడం జరుగుతుంది
నరక చతుర్దశి రోజు సూర్యుడు తుల రాశిలో, చంద్రుడు కూడా చిత్త స్వాతి నక్షత్రం తులారాశి లో ఈవిధంగా రవిచంద్రులిద్దరూ తుల రాశిలోనే ఉండటం జ్యోతిషశాస్త్రం ప్రకారం అత్యంత విశేషమైనది.. దీపావళి రోజు తెల్లవారు జామున తలస్నానం ఆచరించిన వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది తులారాశిలో సూర్యుడు సంచరించే సమయంలో నదుల్లోని నీటిలో శక్తి దాగి ఉంటుందనీ.. ఆ నదీ ప్రవాహంలో గానీ, సముద్రంలో గానీ తలస్నానమాచరించిన వారికి ఆరోగ్యం సిద్ధిస్తుందని ఆయుర్వేద వైద్యం పేర్కొంటోంది.
అందువల్ల నరక చతుర్దశి /దీపావళి రోజున తల స్నానమాచరించడం సనాతనంగా వస్తున్న ధర్మం. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు తమతమ అత్త మామల ఇళ్ళకు వెళ్ళి హారతులు తీసుకుని భోగి స్నానాలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం .
మానవులను
చీకటి నుంచి వెలుగు వైపు.. నడిపించేదే దీపావళి . చీకటి అజ్ఞానానికి, నిరాశకు ప్రతీక కాంతి.. ఆనందానికి సూచిక దీపం ఐశ్వర్యం అంధకారం దారిద్య్ర్యం అజ్ఞానము అనే చీకట్ల నుంచి విజ్ఞానము ఐశ్వర్యం అనే వెలుగులోకి పయనింపజేయడమే దీపావళి పండుగ ఉద్దేశం
. దీపం ఉన్న చోట జ్ఞాన సంపద ఉన్నదని.. దీపం సాక్షాత్తు లక్ష్మీదేవి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. దీపం జ్ఞానానికి, త్రిమూర్తులకు ప్రతీక. అందుకే సనాతన ధర్మంలో ప్రతీ శుభకార్యంలో దీపాన్ని వెలిగిస్తారు.
పురాణాల ప్రకారం.. దీపావళి పండుగ తో నరకాసుర సంహార గాథ, బలి చక్రవర్తి రాజ్య దానం, విక్రమార్కుని పట్టాభిషేకం ముడిపడి ఉన్నాయి. ఆశ్వీయుజ చతుర్దశి రోజు నరకాసురుడిని శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై సంహరించడం వల్ల దీపావళి ఏర్పడిందని. పురాణాలు చెబుతున్నాయి. బలి చక్రవర్తి మహా విష్ణువుకు రాజ్యదానం చేసింది ఈ సమయంలోనే, అలాగే, విక్రమార్కుడికి పట్టాభిషేకం జరిగిన సమయం కూడా ఇదేనని పురాణాలు పేర్కొంటున్నాయి
శాస్త్ర ప్రకారంగా చూస్తే.. దీపావళి ఐదు రోజుల పండుగ. ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి)ధన త్రయోదశి మొదటి రోజు, నరకాసురుడి సంహారం జరిగిన నరక చతుర్దశి రెండో రోజు: ఆశ్వీయుజ అమావాస్య దీపావళి మూడోరోజు. బలి చక్రవర్తి పాతాళంలోకి ప్రవేశించిన రోజు బలి పాడ్యమి నాలుగో రోజు. అలాగే, కార్తీక శుక్ల ద్వితీయ /యమ ద్వితీయ ఈరోజు యమ ధర్మరాజుని ప్రార్ధిస్తారు. భగినీ హస్త విదియ రామాయణం ప్రకారం.. రామ భరతుని యొక్క సమాగమం దీపావళి తో ముడిపడి ఉంది. రావణ సంహారం అనంతరం రాముడు అయోధ్యకు చేరి భరతుడిని కలిసింది దీపావళి రోజే అని రామాయణం పేర్కొంటుంది. దీన్ని ఉత్తరాదిలో భరత్ మిలాప్ వేడుకగా జరుపుకొంటారు.
అభ్యంగన స్నానం, దీపారాధన, ఇంటి ఇలవేల్పు పూజ, లక్ష్మీపూజ దీపావళి రోజు సాయంత్రం పూట లక్ష్మి ఆరాధన చేస్తారు. సనాతన ధర్మంలో దీపావళి అమావాస్య రోజంటే... రామాయణంలో రాముడు అయోధ్యకు వచ్చిన రోజు, పాల కడలి నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు. మహాభారతంలో
నరకాసురుడిని వధించిన రోజు. పాండవులు అజ్ఞాతవాసం ముగించుకొని రాజ్యానికి తిరిగి వచ్చిన రోజు. విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చు ఈ దీపావళి పండుగ మనందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలి.
చెరుకు మహేశ్వర శర్మ రాయికల్ జగిత్యాల
More News...
<%- node_title %>
<%- node_title %>
మళ్లీ ఆర్థిక సడలింపు: కేంద్ర బ్యాంకులు అతిగా వదిలేస్తున్నాయా?
.jpeg)
చీకట్లు చీల్చి వెలుగులు విరజిమ్మే వేడుక దీపావళి పండుగ

ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య

సోను, సతీష్ ల పార్టీ నుండి బహిష్కరణ

ఇజ్రాయెల్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన — 47 సార్లు దాడులు, 38 మంది పాలస్తీనియన్లు మృతి

రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర - సీఎం రేవంత్ రెడ్డి

టపాకులు రాత్రి 8 నుంచి 10 మధ్యనే కాల్చాలి - తిరుమలగిరి ఇన్స్పెక్టర్. జి నాగరాజు

దీపావళి జీవితాల్లో వెలుగు నింపాలి - అజాగ్రత్తతో జీవితాన్ని ఆగం చేసుకోకండి

పేద నిందితులకు బెయిల్ మొత్తాన్ని DLSA చెల్లించచ్చు - సుప్రీంకోర్టు
