దీపావళి సందర్భంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి - చిలకలగూడ ఏసీపీ శశాంక్ రెడ్డి
సికింద్రాబాద్, అక్టోబర్ 19 (ప్రజామంటలు):
దీపావళి పండుగ సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చిలకలగూడ డివిజన్ ఏసీపీ శశాంక్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలకు పలు సూచనలు చేశారు. చిన్న పిల్లలు క్రాకర్లు కాల్చేటప్పుడు తప్పనిసరిగా పెద్దలు దగ్గర ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. క్రాకర్లు కాల్చే ప్రదేశంలో ఇసుక, నీళ్లు, బ్లాంకెట్ వంటి అత్యవసర వస్తువులు సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. శబ్ద కాలుష్యం రాకుండా సౌండ్ తక్కువగా ఉండే క్రాకర్లను మాత్రమే ఉపయోగించాలన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఓపెన్ ప్రదేశాల్లోనే క్రాకర్లు కాల్చాలని సూచించారు. క్రాకర్లు కాల్చేటప్పుడు కళ్లకు మెరుగులు తగిలే ప్రమాదం ఉండేందున దూరంగా ఉండి కాల్చాలని ఆయన హెచ్చరించారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య మాత్రమే క్రాకర్లు కాల్చవచ్చని గుర్తుచేశారు.
క్రాకర్లు కొనుగోలు చేసేటప్పుడు వాహనాలను పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలుపుకోవాలని చెప్పారు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను క్రాకర్లు కొనడానికి తీసుకెళ్లరాదని తెలిపారు. హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టంలోని సెక్షన్ 67(సి) ప్రకారం పబ్లిక్ రోడ్లపై క్రాకర్లు కాల్చడం లేదా కాల్చి రోడ్లపై విసరడం నేరమని ఏసీపీ శశాంక్ రెడ్డి హెచ్చరించారు. ప్రజలందరూ జాగ్రత్తలు పాటించి దీపావళిని సురక్షితంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆయన కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ పెట్టుబడి భారత్‌లోనే — సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం రాబోతోంది - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
.jpeg)
బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డ్

నిజామాబాద్‌లో కానిస్టేబుల్ హత్య

దీపావళి సందర్భంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి - చిలకలగూడ ఏసీపీ శశాంక్ రెడ్డి

యూఎస్ లో అడ్వాన్స్ దీపావళి వేడుకలు

మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ఏఐసీసీ జిల్లా ఇన్చార్జ్ జయ కుమార్ ను కలిసిన షేక్ చాంద్ పాషా

జ్యోతి సురేఖ వెన్నం – భారతీయ ఆర్చరీలోతెలుగు గర్వం
.jpg)
జ్యోతి సురేఖ వెన్నం చరిత్ర సృష్టించింది – వరల్డ్ కప్ ఫైనల్లో కాంస్య పతకం!

జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జెడ్పి డిప్యూటీ సిఈవో పి.నరేష్

42 శాతం బీసీ బిల్లుకు టిపిసిసి లీగల్ సెల్ మద్దతు

42 శాతం రిజర్వేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
