రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర - సీఎం రేవంత్ రెడ్డి
ఘనంగా సదర్ పండగ వేడుకలు
హైదరాబాద్ అక్టోబర్ 19 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారికి ప్రభుత్వంలో తగిన ప్రాతినిథ్యం, సముచిత స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు.
హైదరాబాద్‌లో జరిగిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన సదర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్ ఇందిరా పార్క్ - ఎన్టీఆర్ స్టేడియంలో యాదవ సోదరులు శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. నమ్మిన వారికోసం ఎంత కష్టమొచ్చినా, నష్టమొచ్చినా యాదవులు అండగా నిలబడుతారని, వారి అండతోనే హైదరాబాద్ ప్రపంచ పెట్టుబడులకు ఆదర్శ నగరంగా మారిందని ప్రశంసించారు.
యాదవ సోదరుల ఖదర్ హైదరాబాద్ సదర్ అని, ఎంతో చరిత్ర కలిగిన సదర్ ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరినప్పుడు వెంటనే ఆమోదించడమే కాకుండా నిధులు కేటాయించామని గుర్తుచేశారు. యాదవుల సహకారంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి , హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో పాటు సదర్ సమ్మేళన్ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య

సోను, సతీష్ ల పార్టీ నుండి బహిష్కరణ

ఇజ్రాయెల్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన — 47 సార్లు దాడులు, 38 మంది పాలస్తీనియన్లు మృతి

రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర - సీఎం రేవంత్ రెడ్డి

టపాకులు రాత్రి 8 నుంచి 10 మధ్యనే కాల్చాలి - తిరుమలగిరి ఇన్స్పెక్టర్. జి నాగరాజు

దీపావళి జీవితాల్లో వెలుగు నింపాలి - అజాగ్రత్తతో జీవితాన్ని ఆగం చేసుకోకండి

పేద నిందితులకు బెయిల్ మొత్తాన్ని DLSA చెల్లించచ్చు - సుప్రీంకోర్టు

అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ పెట్టుబడి భారత్‌లోనే — సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం రాబోతోంది - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
.jpeg)
బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డ్

నిజామాబాద్‌లో కానిస్టేబుల్ హత్య
