సీజీవో టవర్ లో మహిళల క్యాన్సర్ వ్యాధి నిర్దారణ శిభిరం
స్వస్త్ నారీ –సశక్త్ పరివార్ అభియాన్
సికింద్రాబాద్, సెప్టెంబర్ 24 (ప్రజామంటలు):
కవాడిగూడలోని సీజీఓ టవర్స్‌లోని సీజీహెచ్ఎస్ ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో సీనియర్ సీఎంఓ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్ష శిభిరాన్ని నిర్వహించారు. ఉచిత ఆరోగ్య పరీక్షలతో పాటు రొమ్ము- గర్భాశయ క్యాన్సర్లపై కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ జ్యోతి జొన్నాదుల మాట్లాడుతూ.. " క్యాన్సర్ చికిత్సను సమర్థవంతంగా అందించాలంటే ముందస్తుగా దానిని గుర్తించటం చాలా కీలకం. ఇలాంటి శిబిరాలు.. నివారణ సంరక్షణను అందించడమే కాకుండా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేసుకోవటానికి ఉన్న ప్రాముఖ్యతపై అవగాహన పెంచుతాయి" అని అన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన పీఐబీ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రుతి పాటిల్ కేంద్ర ప్రభుత్వం చేపడుతోన్న 'స్వచ్ఛోత్సవ్' అనే మరో ముఖ్యమైన కార్యక్రమం గురించి మాట్లాడారు. మంచి ఆరోగ్యం- మంచి పర్యావరణానికి మధ్యనున్న అంతర్లీన సంబంధాన్ని చెప్పారు. 'పునర్వినియోగం - పునరుత్పత్తి - తగ్గించటం( రీయూజ్- రీసైకిల్- రెడ్యూస్) ' అనే మంత్రాన్ని అందరూ పాటించాలని ఆమె కోరారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించటాన్ని ప్రోత్సహించేలా కార్యక్రమంలో పాల్గొన్న వారికి జనపనార సంచులను పంపిణీ చేశారు.బేగంపేటలోని సీజీహెచ్ఎస్ ఆరోగ్య సంరక్షణ కేంద్రం-4.. మహిళల కోసం కాలేయ వ్యాధుల పరీక్ష శిబిరాన్ని నిర్వహించింది.
నివారణ, ముందస్తు వ్యాధి గుర్తింపు అనే లక్ష్యాలతో చేపట్టిన ఈ ఆరోగ్య పరీక్షల్లో దాదాపు 100 మంది పాల్గొన్నారు. దీనితో పాటు ఆయుష్ వైద్యుల సహకారంతో సీజీహెచ్ఎస్ హైదరాబాద్ అదనపు డైరెక్టర్ డాక్టర్ రోహిణి ప్రతాబన్ మార్గదర్శకత్వంలో ఔషధ మొక్కల ప్రయోజనాలపై అవగాహన కల్పించటంతో పాటు వాటి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య

సోను, సతీష్ ల పార్టీ నుండి బహిష్కరణ

ఇజ్రాయెల్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన — 47 సార్లు దాడులు, 38 మంది పాలస్తీనియన్లు మృతి

రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర - సీఎం రేవంత్ రెడ్డి

టపాకులు రాత్రి 8 నుంచి 10 మధ్యనే కాల్చాలి - తిరుమలగిరి ఇన్స్పెక్టర్. జి నాగరాజు

దీపావళి జీవితాల్లో వెలుగు నింపాలి - అజాగ్రత్తతో జీవితాన్ని ఆగం చేసుకోకండి

పేద నిందితులకు బెయిల్ మొత్తాన్ని DLSA చెల్లించచ్చు - సుప్రీంకోర్టు

అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ పెట్టుబడి భారత్‌లోనే — సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం రాబోతోంది - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
.jpeg)
బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డ్
