42 శాతం రిజర్వేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల అక్టోబర్ 18 (ప్రజా మంటలు)
42 శాతం రిజర్వేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు. శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీ లో
రెండు రోజుల పాటు చర్చ అనంతరం అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయన్నారు.
గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్ ఉంది.రాష్ట్ర ప్రభుత్వం
డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలుకు చర్యలు చేపట్టిందన్నారు.
రాష్ట్రములో కుల గణన తో పాటు రాజకీయ విద్య సామాజిక ఆర్థిక అంశాల పై గణన చేపట్టిన రాష్ట్రం తెలంగాణ. దేశంలోనే మొదటి సారి
1 లక్ష మంది ఉపాధ్యాయులు ఉద్యోగులు తో 1 కోటి 20 లక్షల ఇండ్ల లో సర్వే చేపట్టి సమాచారం సేకరణ చేయటం దేశంలోనే మొదటి రాష్ట్రం తెలంగాణ.
తమిళ నాడు తరహా 9వ షెడ్యూల్ లో చేర్చి,బీసీ రిజర్వేషన్ అమలుకు
విస్తృతం గా కమిటీ లు వేయటం జరిగిందన్నారు.
డిల్లీ లో బీసీ రిజర్వేషన్ పై రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యం లో జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టిందని తానుకూడా పాల్గొన్నానని అన్నారు.
దేశంలోనీ మెజారిటీ పార్టీలు జంతర్ మంతర్ వద్ద మద్దతు ప్రకటించాయి...
రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల కు 42 శాతం రిజర్వేషన్ తో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది..
జగిత్యాల నియోజకవర్గ స్థాయిలో గత స్తానిక సంస్థల ఎన్నికల్లో 70 నుండి 75 శాతం బలహీన వర్గాలకు టికెట్లు ఇవ్వడం జరిగింది.
కోర్టు తీర్పును గౌరవిస్తూ
బి ఫాం లు ఇచ్చే అవకాశం వస్తే 42 శాతం టికెట్లను బీసీ లకు ఇచ్చే విధంగా కృషి చేస్తా..
రాష్ట్రంలో బీసీ ఐకాస చేపట్టిన బీసీ బంధు కు జగిత్యాల ఎమ్మెల్యే నా సంపూర్ణ మద్దతు ఉంటుంది.కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలిపింది అని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గం లో బీసీ లకు న్యాయం జరిగేలా 42 శాతం రిజర్వేషన్ కు తన పూర్తి సహకారం ఉంటుంది అన్నారు. ఎమ్మెల్యే.
ఈ కార్యక్రమం లో నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం బాల ముకుందం అడువల లక్ష్మణ్ గోలి శ్రీనివాస్ రవీందర్ రావు కోల శ్రీనివాస్ నక్కల రవీందర్ రెడ్డి అంజన్న రాజేశ్వరరెడ్డి శ్రీనివాస్ మల్లారెడ్డి తొలిప్రేమ శ్రీనివాస్ మల్లన్న బోనగిరి నారాయణ గోడిసెల గంగాధర్ మహేశ్వర్ రావు జుంబర్తి రాజ్ కుమార్ యం ఏ ఆరిఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏఐసీసీ జిల్లా ఇన్చార్జ్ జయ కుమార్ ను కలిసిన షేక్ చాంద్ పాషా

జ్యోతి సురేఖ వెన్నం – భారతీయ ఆర్చరీలోతెలుగు గర్వం
.jpg)
జ్యోతి సురేఖ వెన్నం చరిత్ర సృష్టించింది – వరల్డ్ కప్ ఫైనల్లో కాంస్య పతకం!

జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జెడ్పి డిప్యూటీ సిఈవో పి.నరేష్

42 శాతం బీసీ బిల్లుకు టిపిసిసి లీగల్ సెల్ మద్దతు

42 శాతం రిజర్వేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తెలంగాణ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జనరల్ మీటింగుకు ఎమ్మెల్యే డా సంజయ్ కు ఆహ్వానం అందజేత

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ 15వ సామాజిక తనిఖీ.

పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు యువ ఆఫ్ఘన్ క్రికెటర్లు మృతి — ACB తీవ్ర ఖండన

మహిళల గౌరవం చర్చకు కాదు – ఉత్తరాఖండ్ హైకోర్టు హెచ్చరిక

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై జీవన్ రెడ్డి హామీ

ఇబ్రహీంపట్నం మండలంలో బీసీ బందు ప్రశాంతము.
