ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు
షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం
*డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
సికింద్రాబాద్, అక్టోబర్ 19 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ వైఎంసీఏ చౌరస్తా వద్ద ఎలక్ట్రిక్ బస్సులో ఘోర ప్రమాదం తప్పింది.గోపాలపురం ఎస్.ఐ మాధవి తెలిపిన వివరాల ప్రకారం..ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలు దేరి జూబ్లీ బస్ స్టేషన్ కు వెళ్తున్న పుష్పక్ ఎక్స్ప్రెస్ ఎలక్ర్టికల్ బస్సు సికింద్రాబాద్ వైఎంసీఏ ప్రాంతానికి చేరుకుంది. ఆ సమయంలో ఒక్కసారిగా బస్సులోని వెనక భాగంలో నుంచి దట్టమైన పొగలు, మంటలు వ్యాపించడంతో బస్సులో ఉన్న ప్రయాణీకులు గుర్తించి, డ్రైవర్ కు తెలిపారు. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు నిలిపివేసి సమీపంలోని ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు.
వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అర్పివేశారు. ఊహించని ఘటనతో ప్రయాణీకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఎలక్ర్టికల్ బస్సులో అగ్నిప్రమాదం చోటు చేసుకుందని డ్రైవర్, ప్రయాణీకులు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఫైర్ సిబ్బంది, స్థానికులు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య

సోను, సతీష్ ల పార్టీ నుండి బహిష్కరణ

ఇజ్రాయెల్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన — 47 సార్లు దాడులు, 38 మంది పాలస్తీనియన్లు మృతి

రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర - సీఎం రేవంత్ రెడ్డి

టపాకులు రాత్రి 8 నుంచి 10 మధ్యనే కాల్చాలి - తిరుమలగిరి ఇన్స్పెక్టర్. జి నాగరాజు

దీపావళి జీవితాల్లో వెలుగు నింపాలి - అజాగ్రత్తతో జీవితాన్ని ఆగం చేసుకోకండి

పేద నిందితులకు బెయిల్ మొత్తాన్ని DLSA చెల్లించచ్చు - సుప్రీంకోర్టు

అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ పెట్టుబడి భారత్‌లోనే — సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం రాబోతోంది - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
.jpeg)
బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డ్
