ఏఐసీసీ జిల్లా ఇన్చార్జ్ జయ కుమార్ ను కలిసిన షేక్ చాంద్ పాషా
జగిత్యాల, అక్టోబర్ 18 (ప్రజా మంటలు):
టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ షేక్ చాంద్బాషా గారు జగిత్యాల జిల్లా అతిథి గృహములో ఏఐసీసీ జిల్లా ఇన్చార్జ్ జయ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం ఇచ్చి, కండువా కప్పి సన్మానించారు.
ఈ సందర్భంగా గల్ఫ్ బాధితుల సమస్యలను వివరించారు. గత 20 సంవత్సరాలుగా గల్ఫ్ దేశాల్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డా. షేక్ చాంద్ పాషా నిరంతర పోరాటం చేస్తున్న విషయం తెలిపారు
ఈ విషయంపై మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ టీ. జీవన్ రెడ్డి కూడా పలుమార్లు తెలంగాణ అసెంబ్లీ వేదికగా గల్ఫ్ బాధితుల కోసం స్పందిస్తూ, వారికి ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. BRS ప్రభుత్వం కాలంలో ఈ డిమాండ్లకు స్పందన లేకపోయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి డిసెంబర్ 7, 2023 న గల్ఫ్ బాధితుల సమస్యను స్వయంగా పరిశీలించి, బాధిత కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా అందజేశారని అన్నారు.
ఈ నేపథ్యంలో, దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ గల్ఫ్ బాధితుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డాక్టర్ షేక్ చాంద్బాషా గారు ఏఐసీసీ జిల్లా ఇన్చార్జ్ శ్రీ జయ కుమార్ గారిని కోరారు. గల్ఫ్ దేశాలకు వెళ్లిన వేలాది మంది భారతీయుల త్యాగాలను గుర్తించి, వారి కుటుంబాలకు న్యాయం చేయాలనే దృక్పథంతో ఈ డిమాండ్‌ను AICC దృష్టికి తీసుకెళ్లారు.
గల్ఫ్ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయమని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏఐసీసీ జిల్లా ఇన్చార్జ్ జయ కుమార్ ను కలిసిన షేక్ చాంద్ పాషా

జ్యోతి సురేఖ వెన్నం – భారతీయ ఆర్చరీలోతెలుగు గర్వం
.jpg)
జ్యోతి సురేఖ వెన్నం చరిత్ర సృష్టించింది – వరల్డ్ కప్ ఫైనల్లో కాంస్య పతకం!

జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జెడ్పి డిప్యూటీ సిఈవో పి.నరేష్

42 శాతం బీసీ బిల్లుకు టిపిసిసి లీగల్ సెల్ మద్దతు

42 శాతం రిజర్వేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తెలంగాణ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జనరల్ మీటింగుకు ఎమ్మెల్యే డా సంజయ్ కు ఆహ్వానం అందజేత

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ 15వ సామాజిక తనిఖీ.

పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు యువ ఆఫ్ఘన్ క్రికెటర్లు మృతి — ACB తీవ్ర ఖండన

మహిళల గౌరవం చర్చకు కాదు – ఉత్తరాఖండ్ హైకోర్టు హెచ్చరిక

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై జీవన్ రెడ్డి హామీ

ఇబ్రహీంపట్నం మండలంలో బీసీ బందు ప్రశాంతము.
