డ్రగ్స్ తయారు చేస్తున్న మేధా హైస్కూల్ గుర్తింపును రద్దు చేయాలి
ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి.
*బిజెపి నాయకురాలు ఎం.రాజేశ్వరి.
సికింద్రాబాద్, సెప్టెంబర్14 ,(ప్రజామంటలు):
సికింద్రాబాద్ లో పగలంతా తరగతులు నిర్వహిస్తూ రాత్రంతా మత్తు పదార్థాలు తయారు చేస్తున్న మేధా హై స్కూల్ గుర్తింపును వెంటనే రద్దుచేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకొని తెలంగాణ యువత జీవితాలను కాపాడాలని బిజెపి ఓబీసీ మోర్చా రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఇటీవలే 12 కోట్ల డ్రగ్స్ పట్టుబడ్డాయని అది మర్చిపోకముందే విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన తరగతి గదుల్లో మత్తు పదార్థాలు తయారు చేయడం క్షమించ లేని చర్య అని అన్నారు.
విద్యాశాఖ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇట్టి సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని రాజేశ్వరి డిమాండ్ చేశారు. 2023లో అధికారంలోకి రాకముందు మొట్టమొదటి సంతకం బెల్ట్ షాపులపైనే అని బీరాలు పలికిన ముఖ్యమంత్రి ఇప్పుడు మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో మాత్రమే ప్రభుత్వాన్ని నడపాలని చూస్తున్నారని అన్నారు. తెలంగాణ యువత బతుకు చిత్తు కాకూడదంటే మాదక ద్రవ్యాలపై ఉక్కు పాదం మోపాలని, మద్యాన్ని ఆదాయ మార్గంగా మాత్రమే చూడకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరుణశ్రీ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల జిల్లా కబడ్డీ సబ్ జూనియర్ ఎంపిక పోటీలు.

పెండింగ్ కేసుల కోసం మధ్యవర్తిత్వ కేంద్రాలు. ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ.

టీడీఎఫ్ అట్లాంటా చాఫ్టర్ సహాకారంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు

లాభాలను పన్నులేని దేశాలకు తరలిస్తున్న పెద్ద కంపెనీలు

డ్రగ్స్ తయారు చేస్తున్న మేధా హైస్కూల్ గుర్తింపును రద్దు చేయాలి

ఘనంగా గాంధీ మెడికల్ కాలేజీ 71 వ్యవస్థాపక దినోత్సవ సెలబ్రేషన్స్

భారతీయ మహిళ దుబాయ్ వీడియో. అక్కడి మహిళా సురక్షకు సాక్షమా?.

క్రిప్టో కరెన్సీపేర మోసం కేసులో మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ అరెస్ట్

ప్రజానాయకుల మోసాలతో విసిగిపోయిన నేపాల్ ప్రజలు -ప్రభుచావ్లా
.jpeg)
చార్లీ కిర్క్ ప్రారంభించిన టర్నింగ్ పాయింట్ ఉద్యమం ఆగిపోదు - ఎరికా కిర్క్

4 దశాబ్దాలుగా మానవ సేవే పరమావధిగా రోటరీ క్లబ్ సేవలు....ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్*

బుర్ర భాస్కర్ శర్మచే గీత భవన్ లో ఘనంగా కొనసాగిన కూర్మ పురాణం
