ఘనంగా గాంధీ మెడికల్ కాలేజీ 71 వ్యవస్థాపక దినోత్సవ సెలబ్రేషన్స్
సికింద్రాబాద్, సెప్టెంబర్ 14 (ప్రజా మంటలు):
గాంధీ మెడికల్ కాలేజీ 71వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం కళాశాల ఆలుమ్ని అసోసియేషన్ హాలులో జరిగిన వేడుకలకు ముఖ్యఅతిథిగా ఆలుమ్మి అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ D.రాజారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ చైర్మన్ డాక్టర్ పీవీ.నందకుమార్ రెడ్డి, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ K.మహేష్, GST అడిషనల్ కమిషనర్ డాక్టర్ దొంతి గాంధీ, కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కే ఇందిరా, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి లు అతిథులుగా హాజరయ్యారు.
గాంధీ ఆలుమ్ని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జి.ఆర్ లింగమూర్తి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ A. వెంకటరత్నం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైద్య విద్యా అధ్యాపకులుగా పని చేసిన రిటైర్డ్ ప్రొఫెసర్ లు డాక్టర్ సుధా రమణి, డాక్టర్ అరవింద్ కుమార్, డాక్టర్ అరవింద్ కుమార్, డాక్టర్ అశోక్ కుమార్ లను సన్మానించారు.
గాంధీ మెడికల్ కాలేజీ లోని వివిధ విభాగాలలో యూజీ, పీజీ, సూపర్ స్పెషాలిటీ లలో ప్రతిభ కనబరచి మెరిట్ సాధించిన 64 మంది వైద్య విద్యార్థులకు బంగారు పతకాలను, ప్రశంసా పత్రాలను అందించారు.
పేద వైద్య విద్యార్థులకు స్కాలర్ షిప్ లను ఇవ్వడానికి కొందరు పూర్వ విద్యార్థులు తమ వంతుగా 20 లక్షల రూపాయల విరాళాలను సభా వేదికపై అలుమ్ని అసోసియేషన్ కు అందించారు.
గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్. వాణి మాట్లాడుతూ.. ఆస్పత్రిలో కొన్ని విభాగాల్లో వైద్య పరికరాలు అవసరం ఉన్నాయని చెప్పగానే అక్కడే ఉన్న పూర్వ విద్యార్థులు వాటిని తాము సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల జిల్లా కబడ్డీ సబ్ జూనియర్ ఎంపిక పోటీలు.

పెండింగ్ కేసుల కోసం మధ్యవర్తిత్వ కేంద్రాలు. ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ.

టీడీఎఫ్ అట్లాంటా చాఫ్టర్ సహాకారంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు

లాభాలను పన్నులేని దేశాలకు తరలిస్తున్న పెద్ద కంపెనీలు

డ్రగ్స్ తయారు చేస్తున్న మేధా హైస్కూల్ గుర్తింపును రద్దు చేయాలి

ఘనంగా గాంధీ మెడికల్ కాలేజీ 71 వ్యవస్థాపక దినోత్సవ సెలబ్రేషన్స్

భారతీయ మహిళ దుబాయ్ వీడియో. అక్కడి మహిళా సురక్షకు సాక్షమా?.

క్రిప్టో కరెన్సీపేర మోసం కేసులో మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ అరెస్ట్

ప్రజానాయకుల మోసాలతో విసిగిపోయిన నేపాల్ ప్రజలు -ప్రభుచావ్లా
.jpeg)
చార్లీ కిర్క్ ప్రారంభించిన టర్నింగ్ పాయింట్ ఉద్యమం ఆగిపోదు - ఎరికా కిర్క్

4 దశాబ్దాలుగా మానవ సేవే పరమావధిగా రోటరీ క్లబ్ సేవలు....ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్*

బుర్ర భాస్కర్ శర్మచే గీత భవన్ లో ఘనంగా కొనసాగిన కూర్మ పురాణం
