క్రమశిక్షణ, కఠోర శ్రమ తోనే ఉన్నత శిఖరాలకు - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్
స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ 69వ గేమ్స్ ప్రారంభం
సికింద్రాబాద్, సెప్టెంబర్ 01 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరిధి 69 వ స్కూల్ గేమ్స్ (కబడ్డీ ,ఖోఖో)ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సోమవారం ప్రారంభించారు. అనంతరం విద్యార్ధినీ, విద్యార్ధులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ... విద్యతో పాటు క్రీడల ఆవశ్యకతను వివరించి, జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే క్రమశిక్షణ, కఠోర శ్రమ చాలా అవసరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని, స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పి పిల్లలలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించడానికి కృషి చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి క్రీడలకు బడ్జెట్లో కూడా అధిక నిధులు కేటాయించేలా చేశారన్నారు. 2036లో నిర్వహించనున్న ఒలంపిక్ క్రీడలలో 2 ఈవెంట్లను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. విద్యార్థినీ విద్యార్థులు కూడా ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని ఆసరాగా చేసుకుని విద్యతోపాటు క్రీడలలో కూడా రాణించి దేశంలో తెలంగాణ కీర్తి పతాకను ఎగరవేయాలని చెప్పారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రియదర్శిని, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ సుధాకర్, డిప్యూటీ డిఇఓ గుండప్ప, ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ప్రసన్న, మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బహుళ అంతస్తుల భవనాలు,ఇతర నిర్మాణాల అనుమతులలో జాప్యం కూడదు సి ఎం రేవంత్ రెడ్డి

ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో ప్రకంపనలు
-overlay.jpeg-overlay.png)
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

సంప్రదాయ రీతిలో భాగవత సప్తాహాలు ప్రారంభం

నిబద్ధత క్రమశిక్షణతో పనిచేస్తేనే ప్రజల్లో మంచి పేరు వస్తుంది.. డిఈ దురిశెట్టి మనోహర్ అంకితభావంతో పని చేశారు.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. విద్యుత్ శాఖకే వన్నె తెచ్చారు.. జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ముత్తారం వినాయక మండపంలో ఘనంగా కుంకుమార్చనలు - ప్రత్యేక పూజలతో భక్తి పారవశ్యంలో భక్తులు

మా కామాఖ్య హాస్పిటల్ వారిచే ప్రెస్ క్లబ్ గణపతి వద్ద అన్నప్రసాద వితరణ

ముత్తారం వినాయక మండపంలో ఘనంగా కుంకుమార్చనలు - ప్రత్యేక పూజలతో

పాత పెన్షన్ స్కీం అమలు చేయాలి

గౌడ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనం

కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం కేసీఆర్ జపం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత -పర్యావరణ పరిరక్షణకై మక్తాల దంపతులు
