గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి సూచనలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్
జగిత్యాల ఆగస్టు 30 (ప్రజా మంటలు)
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేశ్ మండపాల వద్ద నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, వినాయక మండపాలు వద్ద అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.జిల్లా కేంద్రం లో కేంద్రం లో ఏర్పాటు చేసిన గణేశ్ మండపాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించి నిర్వహకులకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ప్రతి రోజు రాత్రి నలుగురు వాలంటరీలు మండపంలోనే ఉండాలని అన్నారు. జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలు పోలీసు శాఖ వారిచే సూచించబడిన సూచనలు పాటించాలని అన్నారు. విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సమస్యలు ఉంటే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. అనంతరం నిమజ్జనం రోజు తీసుకోవాల్సిన నిబంధనలు పాటించాలని, ఏలాంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా శాంతియుత వాతావరణంలో శోభయాత్ర సాగేలా పోలీసులకు సహకరించాలని కోరారు.
అధికారులకు బందోబస్తు, పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని, మండపం వద్ద ఏర్పాటు చేసిన పాయింట్ బుక్ లను చెక్ చేయాలని సూచించారు. అనంతరం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పికెట్లను పరిశీలించి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎస్పీ వెంట డీఎస్పీ రఘు చందర్,SB ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ ఎస్.ఐ లు ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల పట్టణంలో విద్యానగర్ లో 11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్
1.jpeg)
రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి. జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.

మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి

దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్

ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ

దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి కుంకుమార్చన

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి
