తండ్రి మరణం.. తల్లి అదృశ్యం... గాంధీలో దైన్యస్థితిలో మూడేండ్ల చిన్నారి
రెండు రోజుల తర్వాత మేనమామల చెంతకు కార్తీక
సికింద్రాబాద్, ఆగస్ట్ 30 (ప్రజామంటలు) :
మూడేళ్ల చిన్నారికి పెద్ద కష్టమే వచ్చింది. లోకజ్ఞానం ఎరుగని చిన్నారి తండ్రి అనారోగ్యంతో ఆస్పత్రిలో మృతిచెందగా, మానసిక ఆందోళనతో తనని విడిచిపెట్టి తల్లి ఎటో వెళ్లిపోయింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న పాపను సెక్యూరిటీ సిబ్బంది చేరదీశారు. పత్రికల్లో వచ్చిన వార్త కథనాలను చూసిన పాప మేనమామలు సికింద్రాబాద్ కు వచ్చి పాపను తీసుకొని వెళ్ళారు..వివరాలు ఇవి. నారాయణపేట జిల్లా కోస్గి గ్రామానికి చెందిన బాబు (35), శాంత(31) లు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కూతుర్లు. ఈనేపధ్యంలో ఇటీవల ప్రమాదంలో గాయపడిన బాబు చికిత్సకై గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. దాంతో భర్త చనిపోయిన బాధలో డిప్రెషన్ కు గురైన భార్య శాంతమ్మ చిన్నారి కూతురు కార్తీక ను గాంధీలో వదిలిపెట్టి ఎటో వెళ్ళిపోయింది. గాంధీ క్యాంటిన్ వద్ద ఏడుస్తూ కనిపించిన చిన్నారిని చూసిన సెక్యూరిటీ సిబ్బంది చేరదీసి, చిలకలగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిన్నారి తప్పిపోయిన వార్త కథనం శనివారం పత్రికల్లో ప్రచురితం కావడంతో వికారాబాద్ జిల్లా దుడ్యాల్ మండలం చిల్మల్ మైలారం గ్రామానికి చెందిన పాప మేనమామలు చూసి శనివారం సాయంత్రం గాంధీ ఆసుపత్రికి వచ్చారు. అక్కడి నుంచి చిలకలగూడ పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఇన్స్పెక్టర్ అనుదీప్, ఎస్.ఐ రాకేశ్ లను కలిసి, జరిగిన సంఘటనలను వివరించారు.
గాంధీ సెక్యూరిటీ చీఫ్ శివాజీ పాప కార్తీకను తీసుకొని పీఎస్ కు వెళ్ళి పోలీసుల సమక్షంలో పాప కార్తీక మేనమామలు శేఖర్, నర్సయ్య లకు అప్పగించారు. స్వగ్రామంలోని సర్పంచికి ఫోన్ చేసిన పోలీసులు పాప కుటుంబసభ్యులను నిర్ధారించుకొని, వివరాలను సరిపోల్చుకున్నారు. చిన్నారిని చేరదీసి రెండురోజుల పాటు ఆలన,పాలన చూసిన గాంధీ సెక్యూరిటీ సిబ్బందిని అభినందించారు. ఓవైపు కన్నతండ్రిని కోల్పొయి, మరో వైపు తల్లి అదృశ్యం కావడం పట్ల చిన్నారి ధైన్య స్థితిని చూసిన పలువురు కంటతడిపెట్టారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల పట్టణంలో విద్యానగర్ లో 11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్
1.jpeg)
రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి. జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.

మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి

దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్

ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ

దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి కుంకుమార్చన

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి
