సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాల ను సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్
జగిత్యాల ఆగస్టు 25 ( ప్రజా మంటలు)
పట్టణంలోని భవానీ నగర్ లోని తెలంగాణా సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ ను నాయకులతో కలసి సందర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
హాస్టల్ లోని స్టోర్ రూమ్, వంట గదిని, పరిశీలించి అనంతరం మధ్యాహ్న సమయంలో విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డ తర్వాత దేశంలో ఎక్కడ లేని విధంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నామని, ఈ 10 సంవత్సరాల్లో విద్యా విధానంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత విద్యార్థుల భోజన మెస్ చార్జీలు సరిపోవడం లేదని ప్రభుత్వం 3వ తరగతి నుండి 7వ తరగతి విద్యార్థులకు మెస్ చార్జీలు 950 రూ. నుండి 1330 రూ. 8 వ తరగతి నుండి 10వ తరగతి వరకు 1100 రూ. నుండి 1540 రూ. కు ఇంటర్ విద్యార్థులకు 1500 రూ. నుండి 2100 రూ. దాదాపు 40 శాతం ఛార్జీలు పెంచడం జరిగిందని, బాలికలకి కాస్మొటిక్ చార్జీలు కూడా పెంచడం జరిగిందని తెలిపారు.
రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆడపిల్లల చదువులు ఆపొద్దని ఈ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు., సొంత భవనాలు లేని కారణంగా అద్దె భవనాల్లో పాఠశాలలు నిర్వసిస్తున్న విషయాన్ని గమనించిన సీఎం రేవంత్ రెడ్డి జగిత్యాల పట్టణంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ 200 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని తెలిపారు.
ఈ రోజు విద్యార్థులతో కలసి భోజనం చేశానని, పప్పు, గోరు చిక్కుడుకాయ కూర, పచ్చిపులుసు, పెరుగుతో భోజనం రుచిగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పర్మిషన్ లేకుండా ఇసుక తరలింపు - ట్రాక్టర్ పట్టివేత

కామన్వెల్త్ గేమ్స్మీ లో మీరాబాయి చానుకు స్వర్ణం !
.jpg)
రాజస్థాన్‌లో డైనోసార్ శిలాజం బయటపడింది!
.jpg)
పోలీసులు స్టేషన్ నుండే సాక్ష్యం ఇవ్వచ్చు ననే ఢిల్లీ LG నోటిఫికేషన్‌ను వ్యతిరేకించిన బార్ కౌన్సిల్
-(1).jpg)
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాల ను సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్

పెరిగిన బాధ్యతతో క్రమశిక్షణగా విధులు నిర్వహించాలి పదోన్నతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ

గణేశ్ ఏర్పాట్లు, జాగ్రత్తలపై చిలకలగూడ ఏసీపీ సమీక్షా

తనకు సైన్స్ పాఠాలు చెప్పిన టీచర్‌కు ఎమ్మెల్యే సన్మానం

పండుగను సంబురంగా, శాంతియుతంగా జరుపుకోవాలి. - నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్

గణేష్ నవరాత్రుల నిర్వాహకులతో సిఐ, రామసింహారెడ్డి సమావేశంల

ప్రపంచంలోనే అద్భుతమైన విశ్వవిద్యాలయంగా ఉస్మానియా ను తీర్చిదిద్దాలి - డీమ్ రేవంత్ రెడ్డి
