బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ -మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాల ఆగస్టు 10 (ప్రజా మంటలు):
జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్, ఓరుగంటి రమణారావు తదితరులు పాల్గొన్నారు.
కొప్పుల ఈశ్వర్ గారు మాట్లాడుతూ, బీసీ లను నమ్మించి మోసం చేశారు. 42%రిజర్వేషన్ రాష్ట్ర పరిధిలో లేదు, కేంద్ర పరిధిలోని అంశం, 9వ షెడ్యూల్ లో చేరిస్తేనే అమలు... బి సి ల ఓట్లు కొల్లాగొట్టడం కోసం శాసనసభ తీర్మానం, మంత్రి వర్గ సమావేశము, ఆర్డినేన్స్, గవర్నర్ దగ్గరకు పంపడం.. కేంద్రంకు పంపడం... ఆమోదం లభించని పరిస్థితి అందరికి తెలుసు.. సీఎం, మంత్రులు అందరు ఢిల్లీ లో ధర్నా చేస్తూ మేము ప్రయత్నం చేసినం అని బీసీలను మోసగిస్తున్నారు.
రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత బి సి రిజర్వేషన్ సాధిస్తాం అని చెప్పడం విడ్డురంగా ఉంది.. బి సి ల కోసం బి ఆర్ యస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందను అన్నారు.
బి సి రిజర్వేషన్ ఫై బి ఆర్ యస్ పార్టీ ఈ నెల 14నాడు కరీంనగర్ లో నిర్వహిస్తున్న సమావేశము కేటీఆర్ రానున్నారని, జగిత్యాల జిల్లా నుండి వేలాదిగా తరలి వెళ్ళానున్నామని తెలిపారు.వర్షాలు లేవు, రిజర్వాయర్ల లో నీళ్లు అడగంటిన పరిస్థితి srsp లో 55టీఎంసీ ల నీళ్లు మాత్రమే ఉన్నాయి..9,65,000 ఎకరాల ఆయకట్టుకు 6లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉందని,, srsp ఫేజ్ 1కింద లక్షలాది ఎకరాల్లో రైతులు పంటలు నార్లు వేసిన వారికి నీళ్లు అందిస్తారని అన్నారు.
రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని.. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో రైతులకు సకాలంలో ఎరువులు అందించమని, రైతు బంధు, రుణమాఫీ చేశామని పేర్కొన్నారు.. 600మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, మిడ్ మానేరు, యల్ యం డి, మల్లన్న sagar, srsp రిజర్వాయర్ లో నీళ్లు లేవని.. పేర్కొన్నారు.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి తో అందరికి న్యాయం చేయాలనీ పేర్కొన్నారు.
కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ...
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 19నెలలు.. అబద్దపు హామీలతో గద్దెనెక్కి.. బి సి రిజర్వేషన్ 42% సాధిస్తామని.. ఢిల్లీలో ధర్నా చేపట్టి ఇందిరా గాంధీ కుటుంబాన్ని పొగడటం.. మోడీ గారిని తిడుతూ మిమ్మల్ని ఒక మాట తిడుతా ఏమి అనుకోవద్దు అన్నట్టు ఉంది ఈ సీఎం వ్యవహారం..ఎదో ఒక వ్యవహారంతో పబ్బం గడపడం..బీసీ లను మోసం చేస్తూ...
కేసీఆర్ గారిని తిట్టడం బంద్ చెయ్.. తిట్టడం వల్ల జీరో అయిపోతున్నావ్.. బి ఆర్ యస్
బి సి రిజర్వేషన్ సభ ఈ నెల 14 నాడు కరీంనగర్ లో జరగనుందని తెలిపారు..
దావ వసంత సురేష్ మాట్లాడుతూ...
సిట్ల కోసం, ఓట్ల కోసం దేవుళ్ళ మీద ఒట్టు పెడుతూ... అమలు కానీ హామీలు ఇచ్చినరని... కేసీఆర్ గారి హయాంలో బీర్పూర్ రోళ్లవాగు ప్రాజెక్టు ను కొప్పుల ఈశ్వర్ గారు,అప్పటి ఎంపీ కవిత గారు, అప్పటి మంత్రి హరీష్ రావు గారి సహకారంతో ఆధునికరించి.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో ఉన్న దీన్ని పట్టించుకోలేదని.. గోదావరి పరివాహక ప్రాంతమైన రైతులకు నీళ్లు లేని పరిస్థితి.. నార్లు ముదిరిపోతున్నాయని.. ఇందిరమ్మ ఇండ్లు ప్రొసీడింగ్ కాపీ లు, కొలతలు ప్రకారం నిబంధన్లు,, రాజీవ్ యువ వికాసం బడ్జెట్ లో డబ్బులు లేవని.. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే...
బీసీ లపై కపట ప్రేమ అని, కామారెడ్డి డిక్లరేషన్..
బీసీ లంటే చిన్న చూపని ఏద్దేవా చేశారు..
ఈ కార్యక్రమం లో బి ఆర్ యస్ రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులు ఓరుగంటి రమణ రావు, జవ్వాజి ఆది రెడ్డి, హరీష్ కల్లూరి, అల్లాల రాజేశ్వర్ రావు,చందా సాయి తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి ప్రెస్ క్లబ్ (ఐజేయు) అధ్యక్షునిగా మధు మహాదేవ్ ఎన్నిక

బీహార్ లో కొత్తగా 64 వేల మంది మళ్లీ ఓటరు నమోదుకు దరఖాస్తు

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచంద్రరావును కలిసిన మర్రి

మరో చెట్టుకు పునర్జన్మను ఇచ్చిన మహంకాళి ట్రాఫిక్ పోలీసులు

తెలుగు వర్సిటి ఇంద్రజాలం కోర్సులో నేరుగా ప్రవేశం
.jpeg)
సృష్టి కేసు సిట్ కు బదలాయింపు - 25 మంది అరెస్ట్, రిమాండ్

ఆగ్నేయాసియాలో తొలి తుల్సా-ప్రో చికిత్సలు ప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్

అత్తాపూర్ లో మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్వీన్ స్టూడియో ఓపెనింగ్

అమ్మక్కపేట్ సబ్స్టేషన్ కు అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు - ఉద్యోగి అరెస్టు

వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి - సీఎం రేవంత్ రెడ్డి

దేశంలో 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదించిందం
.jpeg)