రోగనిరోధక శక్తి ఎక్కువైతే పిల్లలకు ముప్పే - కిమ్స్ ఆస్పత్రిలో పీడియాట్రిక్ రుమటాలజీపై సదస్సు
వాస్క్యులైటిస్, ఆర్థరైటిస్, కవాసాకి డిసీజ్‌లు వచ్చే ప్రమాదం
వీటిని జాగ్రత్తగా గమనించి సత్వర చికిత్సలు అందించాలి
లేనిపక్షంలో ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం
ప్రపంచ ప్రఖ్యాత వైద్యనిపుణుడు ప్రొఫెసర్ సుర్జీత్ సింగ్
సికింద్రాబాద్, ఆగస్ట్ 10 (ప్రజామంటలు) :
సాధారణంగా మన శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి బయటి నుంచి వచ్చే బ్యాక్టీరియాలు, ఇన్ఫెక్షన్లపై పోరాడుతుంది. కానీ, అది బాగా ఎక్కువైతే.. మన సొంత శరీర అవయవాలనే శత్రువులుగా భావించి వాటి మీద దాడి చేస్తుంది. అప్పుడు ఆ అవయవాలు క్రమంగా క్షీణిస్తాయని ప్రపంచ ప్రఖ్యాత పీడియాట్రిక్ రుమటాలజిస్ట్, ఇమ్యునాలజిస్ట్, చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ సుర్జీత్ సింగ్ తెలిపారు.
ఆదివారం నగరంలోని సికింద్రాబాద్ కిమ్స్ కడల్స్ ఆస్పత్రిలో పీడియాట్రిక్ రుమటాలజీపై జరిగిన సదస్సులో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ....దీనివల్ల వచ్చే వాస్క్యులైటిస్, ఆర్థరైటిస్, కవాసాకి డిసీజ్ లాంటివి అత్యంత ప్రమాదకరం. దురదృష్టకరమైన విషయం ఏంటంటే, పిల్లలకు కూడా ఇవి సోకేందుకు చాలా అవకాశం ఉంటుంది. వాళ్ల విషయంలో తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. తరచు జ్వరం, ఒంటిమీద దద్దుర్లు, దగ్గు, జలుబు లాంటివి వస్తుంటే వెంటనే జాగ్రత్తపడి ఇమ్యునాలజీ నిపుణుల వద్దకు తీసుకెళ్లాలి. లేనిపక్షంలో పిల్లలకు ప్రాణాపాయం సంభవించే ప్రమాదం సైతం ఉందన్నారు.
ఐదేళ్లలోపు పిల్లలకు గుండె రక్తనాళాల్లో వాపు వచ్చి, గుండె వైఫల్యం సంభవించే అత్యంత ప్రమాదకరమైన కవాసాకి డిసీజ్ అనే వ్యాధి వచ్చిన వారిలో ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా పిల్లలకు చికిత్స చేసి, వారి ప్రాణాలను కాపాడిన చరిత్ర ఉన్న ప్రొఫెసర్ సుర్జీత్ సింగ్.. ఈ సదస్సును కిమ్స్ ఆస్పత్రుల సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు, చీఫ్ నియోనాటాలజిస్ట్, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ బాబు ఎస్. మదార్కర్, పీడియాట్రిక్ ఇమ్యునాలజీ, రుమటాలజీ విభాగం కన్సల్టెంట్ డాక్టర్ అబర్ణా తంగరాజ్, పీడియాట్రిక్స్ విభాగం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ పరాగ్ శంకర్‌రావు డెకాటే, ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 400 మందికి పైగా వైద్యులు హాజరైన ఈ సదస్సులో ప్రధానంగా పిల్లలకు వచ్చే పలు రకాల సమస్యలు, ముఖ్యంగా రోగ నిరోధక శక్తి ఎక్కువ కావడం, తక్కువ కావడం వల్ల వచ్చే సమస్యలపై కూలంకషంగా చర్చించి, సమగ్ర వివరాలు తెలిపారు.
సదస్సులో కిమ్స్ ఆస్పత్రిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ రుమటాలజీ అండ్ క్లినికల్ ఇమ్యునాలజీ విభాగం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వీరవల్లి శరత్ చంద్రమౌళి మాట్లాడుతూ, పిల్లలకు ఏడాది వయసు ఉన్నప్పటి నుంచి సాధారణంగా 15 ఏళ్ల లోపు వరకు ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. వీటి లక్షణాలు తొలుత సాధారణంగానే అనిపిస్తాయి. మామూలు జ్వరం రావడం, ఒంటి మీద దద్దుర్లు, దగ్గు, జలుబు లాంటివి పదే పదే వస్తుంటాయి. వీటిని మామూలు లక్షణాలు అనుకుని వాటికి మాత్రమే చికిత్స చేయిస్తూ వదిలేస్తే చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అందువల్ల పిల్లల వైద్యులు, జనరల్ ఫిజిషియన్లు కూడా దీనిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలను తల్లిదండ్రులు ఇలాంటి లక్షణాలతో తీసుకొచ్చినప్పుడు వెంటనే పీడియాట్రిక్ క్లినికల్ ఇమ్యునాలజిస్టులు, రుమటాలజిస్టుల వద్దకు పంపాలి. అప్పుడే తగిన పరీక్షల ద్వారా అసలు సమస్య ఏంటన్నది గుర్తించి, దానికి వెంటనే చికిత్స ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది.
వీటిలో కొన్నింటికి దీర్ఘకాలం పాటు .. అంటే కొన్ని వారాల తరబడి చికిత్స చేయాల్సి రావచ్చు. ఒక్కో రకం సమస్యకు ఒక్కో తరహా ఇమ్యునో సప్రెసెంట్లు, ఇతర మందులు వాడాల్సి ఉంటుంది అని తెలిపారు.
పీడియాట్రిక్ అకాడమీ ఆఫ్ తెలంగాణ స్టేట్ (పాట్స్), ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఏపీ) జంటనగరాల శాఖ, లిటిల్ వన్స్ క్యూర్ ఫౌండేషన్ సహకారంతో కిమ్స్ కడల్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో కిమ్స్ కడల్స్ ఆస్పత్రిలో సీనియర్ కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్, పీడియాట్రీషియన్ డాక్టర్ అపర్ణ సి, ఇంకా డాక్టర్ కె.వి. అనిల్ కుమార్, డాక్టర్ గుమ్మడి అంజని, డాక్టర్ అబర్ణా తంగరాజ్, డాక్టర్ జాస్తి శ్రీరేఖ, డాక్టర్ సంబిత్ సాహు, డాక్టర్ పి. రాకేష్ కుమార్ పాల్గొన్నారు.
–ఫొటో
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి ప్రెస్ క్లబ్ (ఐజేయు) అధ్యక్షునిగా మధు మహాదేవ్ ఎన్నిక

బీహార్ లో కొత్తగా 64 వేల మంది మళ్లీ ఓటరు నమోదుకు దరఖాస్తు

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచంద్రరావును కలిసిన మర్రి

మరో చెట్టుకు పునర్జన్మను ఇచ్చిన మహంకాళి ట్రాఫిక్ పోలీసులు

తెలుగు వర్సిటి ఇంద్రజాలం కోర్సులో నేరుగా ప్రవేశం
.jpeg)
సృష్టి కేసు సిట్ కు బదలాయింపు - 25 మంది అరెస్ట్, రిమాండ్

ఆగ్నేయాసియాలో తొలి తుల్సా-ప్రో చికిత్సలు ప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్

అత్తాపూర్ లో మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్వీన్ స్టూడియో ఓపెనింగ్

అమ్మక్కపేట్ సబ్స్టేషన్ కు అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు - ఉద్యోగి అరెస్టు

వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి - సీఎం రేవంత్ రెడ్డి

దేశంలో 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదించిందం
.jpeg)