బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జికు సన్మానం.
ఇబ్రహీంపట్నం జూలై 29 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
తెలంగాణ జడ్జెస్ అసోసియేషన్ ఎన్నికల్లో మెట్ పల్లి జూనియర్ సివిల్ జడ్జి నారం అరుణ్ కుమార్ గారు ఈసి మెంబర్ గా గెలుపొందిన సందర్బంగా ఆయనకి మంగళవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానం ఏర్పాటు చేసారు. సేవాభావంతోనే ఉన్నత పదవులు లభిస్తాయి అని మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి కె. నాగేశ్వర్ రావు అన్నారు. రాష్ట్ర స్థాయి జ్యుడిషియల్ అధికారుల సంఘానికి జగిత్యాల జిల్లా నుండి అరుణ్ కుమార్ ప్రాధాన్యత వహించడం మన అందరికీ గర్వకారణంగా ఉందన్నారు.
మెట్ పల్లి న్యాయధికారీగా ఉన్న అరుణ్ కుమార్ భవిష్యత్తులో కూడా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి అన్నారు. బార్ అసోసియేషన్ సన్మానం తనపై మరింత బాధ్యత పెంచిందని సన్మాన గ్రహీత మరియు జూనియర్ సివిల్ జడ్జి నారం అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లోఅడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెర్లపల్లి ఆనంద్ గౌడ్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రణయ్, కోరుట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు బైరి విజయ్ కుమార్, మెట్ పల్లి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి గజేల్లి రామ్ దాస్, ట్రెజరర్ పడిగేలా శ్రీనివాస్, ఈసి మెంబర్లు కట్ట నర్సాగౌడ్, మన్నె గంగాధర్ మరియు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం
