నాగ పంచమి పుట్టలో పాలు పోసి పాములను పూజించడం విశేషం ..
రాయికల్ జూలై28 (ప్రజా మంటలు)
హిందూ సాంప్రదాయంలో
శ్రావణమాసం శుక్లపక్షంలో వచ్చే పంచమి రోజును నాగ పంచమి అంటారు.
మంగళవారం నాగుల పంచమి సందర్భంగా రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ నాగుల పంచమి విశిష్టతను వివరించారు.
బ్రహ్మదేవుడు , ఆదిశేషువును అనుగ్రహించిన రోజును నాగ పంచమిగా వ్యవహరిస్తారని అన్నారు.
కార్తీక మాసం లో వచ్చే''నాగులచవితి'' మాదిరిగానే శ్రావణ మాసంలో నాగ పంచమి నాడు హిందూ మహిళలు బాలికలు నాగ దేవతను పూజించి , పుట్టలో పాలు పోస్తారు. నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి , సంవత్సరం పొడుగునా ఏ సమస్యలూ లేకుండా , అన్నీ సవ్యంగా నెరవేరుతాయని , పరిస్థితులు అనుకూలిస్తాయని, నాగదోషం తొలగిపోతుందని హిందువులు విశ్వసిస్తారని ఆయన అన్నారు.
చలి చీమ నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు , రాయి - రప్ప , చెట్టు - చేమ , వాగు - వరద , నీరు - నిప్పు , అన్నిటా అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కృతి హిందువులది . హిందువుల దృష్టిలో పాము కుడా పరమాత్మ స్వరూపమే . వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తి కి పాన్పు. వాసుకి పరమేశ్వరుడి కంఠాభరణం. వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడని చెరుకు మహేశ్వర శర్మ చెప్పారు.
పురాణాల ప్రకారం
కశ్యప ప్రజాపతికి , కద్రువ దంపతులకు అనంతుడు , తక్షకుడు , వాసుకి , ననినాగుడు , శంఖుడు , కర్కోటకుడు , ఉగ్రకుడు పిందారకుడు , హహుషుడు , ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా కాటు వేస్తూ భయభ్రాంతులను చేయసాగారు.
దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు. అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై మమ్మల్ని మీరే సృష్టించి మాకీ విధంగా శాపమివ్వడం న్యాయమా అని వేడుకున్నారు .
విషయుక్తం గా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణికోటిని నశింప జేయడం తప్పు కదా ' నిష్కారణం గా ఏ ప్రాణినీ హింసించరాదు. గరుడ మంత్రం చదివే వారిని , ఔషధమని సమేతులను తప్పించుకు తిరగండి. దేవతా విహంగ గణాలకు , జ్ఞాతులైన మీరు మీమీ స్థాన గౌరవాలను నిలిపుకోండి . వాయుభక్షకులై సాదుజీవులు గా మారండి. మీ నాగులంతా అతల వితల పాతాళ లలో నివాసం చేయండి"* అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు.
దాంతో దేవతలంతా నాగులను ప్రశంసించారు. భూలోక వాసులంతా ప్రార్ధనలు చేశారు నాగులకు. దివ్య ప్రభావ సంపన్నమయిన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకం గా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజచేయడం మొదలు పెట్టారని చెరుకు మహేశ్వర శర్మ వివరించారు
వైదిక కాలం నుండి శ్రావణ మాసం ఐదవ రోజు పంచమి ఉత్సవాలు జరుపుకునే సంప్రదాయం భారత దేశమంతా ఉంది. పుట్టలో ఆవుపాలు , వడపప్పు , చలిమిడి , అరటిపండ్లు , కోడి గ్రుడ్లు జారవిడిచి నైవేద్యం గా సమర్పిస్తారని ఆయన అన్నారు.
పూర్వకాలంలో
పార్వతీ దేవికి పరమేశ్వరుడు చెప్పినట్లు గా పురాణాలలో నాగుల పంచమి ప్రాముఖ్యత ను తెలిపారు. శ్రావణ మాస శుక్ల పంచమినాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగ పంచమి నాడు ద్వారానికి ఇరువైపులా సర్ప చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం. చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి , కర్రతోగానీ , లేదా మట్టితోగానీ వారి వారి శక్త్యానుసారం భక్తి భావము తో ఐదు పడగల పాము ప్రతిమను చేయించాలి. లేదంటే పసుపు , చందనంతోగానీ ఏడు తలల పాము చిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాజి , సంపెంగ , సన్నజాజి ,మల్లె,గన్నేరు తదితర పుష్పాలతో పూజించాలి. పాయసము , పాలు నివేదన చేయాలని అన్నారు
గరుడ పంచమిగా కూడా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందేలేచి శుచిగా స్నానమాచరించి , ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
ఇంటి గడప , పూజగదిని పసుపు , కుంకుమలు , పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ , పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక ఉత్తముడైన బ్రాహ్మణులకు తాంబూలం , పానకం, వడపప్పులతో సహా నాగప్రతిమను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని
పాపాల నుంచి విముక్తి లభించడం , సర్ప భయం తొలగిపోవడం వంటివి జరుగుతాయని
పురాణాలు శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
పాములను పూజించడం వెనుక సామాజిక మైన హితవు ఉన్నది . యోగాలో కూడా ఇవి ఎంతో ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయి., పాము ‘కుండలినికి’ సంకేతం. స్వభావం , కదలిక , నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల , పామును కుండలినికి సంకేతంగా చూస్తారు. ఇంకో అంశం ఏమిటంటే పాము జీవ పరిణామ క్రమంలో చాలా ముఖ్యమయిన మలుపు. ‘శక్తి’ పరంగా పాము విశిష్ట స్థానంలో ఉంటుంది. పాములు కొన్ని రకాల శక్తులకు ఎంతో స్పందిస్తాయి.
స్వభావం , కదలిక , నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల , పామును కుండలినికి సంకేతంగా చూస్తారు. హిందూ సంస్కృతిలో పాముని చంపడం పాపంగా భావిస్తారు. పాముని చంపినా , పాము మృతదేహాన్ని చూసిన దానికి అంతిమ సంస్కారం చేయడం ఆనవాయితీ.
కాలసర్ప దోషం ఉన్నవారు , ప్రత్యేకంగా నాగ పంచమి రోజున నాగ దేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు. నాగ పంచమి నాడు పుట్టలో పాలు పోసి పూజలు చేయడం వలన దోష నివారణ జరిగి , సుఖసంతోషాలు అనుభూతికి వస్తాయని చెరుకు మహేశ్వర శర్మ వివరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

హెచ్ టి సర్వీసుల మంజూరుకు సింగిల్ విండో వ్యవస్థ

ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ రమణ
.jpg)
రాయపట్నం గ్రామంలో గంజాయి పట్టివేత
.jpeg)
ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు

మైనర్ బాలికపై అత్యాచారం కేసులలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష

ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం

విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యాబోధన అందించాలి

లబ్ధిదారుల గ్రామలకు వెళ్లి కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జికు సన్మానం.

భక్తి శ్రద్దలతో.సికింద్రాబాద్ ప్రాంతంలో నాగుల పంచమి

నూతనంగా ఎన్నికైన,జిల్లా జర్నలిస్టుల సంఘం( టి యు డబ్ల్యు జె ఐజేయు), జిల్లాపాఠశాల విద్యాశాఖ ఫోరం, కోశాధికారి, కార్యదర్శికి బ్రాహ్మణ సంఘం సత్కారం
