భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - ఎస్సై శ్రీధర్ రెడ్డి
గొల్లపల్లి (మేడిపల్లి),జులై 26 (ప్రజా మంటలు):
మేడిపల్లి, మండలాల ప్రజలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని,అవసరం అయితే తప్ప బయటకు రావద్దని, రైతులు పొలాల దగ్గరకి వెళ్ళినప్పుడు కరెంట్ వైర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి,భారీ వర్షాలు కురుస్తున్నందున విద్యుత్ స్తంభాలు,వైర్లకు తాకకుండా తగు జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలని మేడిపల్లి ఎస్సై మాడ శ్రీధర్ రెడ్డి తెలిపారు .భారీ వర్షాల వల్ల ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు,వంకలు,చెరువులు వద్ద వరద ప్రవాహం అధికంగా ఉన్న చోట వద్దకి ఎవరు వెళ్లవద్దన్నారు.వర్షం నీటి వల్ల రోడ్డుపై వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నందున,పరిమిత వేగంతో వాహనాలు నడపాలని సూచించారు.పిల్లలు,యువకులు చెరువులు,కాలువల దగ్గరకు సెల్ఫీలు తీసుకోవడానికి,ఈత కొట్టడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు.శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండకూడదు,వర్షం సమయంలో చెట్ల కింద ఉండటం వల్ల పిడుగుపాటుకు గురయ్యే అవకాశం ఉంది అందువల్ల చెట్లకింద ఉండరాదు,చేపలు పట్టుటకు,పశువులను మేపడానికి బయటకి వెళ్లకూడని తెలిపారు
More News...
<%- node_title %>
<%- node_title %>
కిమ్స్-సన్షైన్ హాస్పిటల్ లో భుజం మార్పిడి విజయవంతం

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి (CPR )పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలి: శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్

క్రైస్తవుల జనాభాకు అనుకూలంగా చర్చిలు పెరగాలి - ఉప్పల్ పాస్టర్ ఫెలోషిప్ ఎన్నిక

చురుకైన నాయకత్వాన్ని తీర్చిద్దుతాం - తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నాం - జాగృతి అధ్యక్షురాలు కవిత

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - ఎస్సై శ్రీధర్ రెడ్డి

గాంధీలో హెపటేటిస్ బీ వ్యాక్సినేషన్ - 390 మంది సిబ్బంది వ్యాక్సిన్

ప్రీస్కూల్ ఆక్టివిటీస్ తో చిన్నారులకు మేధాశక్తి పెరుగుతుంది ఐసిడిఎస్ సూపర్వైజర్ శైలజ

దివ్యాంగుల ఆరోగ్య సంరక్షణలో వైద్య నిపుణులకు శిక్షణ

రాష్ర్టపతి నిలయంలో ఘనంగా కార్గిల్ దివస్
.jpg)
వృద్ధుల సంరక్షణకు ఆర్డీవో ఆదేశాలు

ఇది ప్రజాపాలన మంత్రిగారు.... మా కాలనిలోని సమస్యలు తీర్చండి
