లంచం డిమాండ్ చేసిన పారిశుద్ధ్య కార్మికుల ను విధుల నుంచి తోలగించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
రామగుండం జూలై 26:
లంచం డిమాండ్ చేసిన ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
గోదావరిఖని జనరల్ ఆసుపత్రి లో శుక్రవారం ఆకస్మిక తనిఖీ సమయంలో ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఏజేన్సీ ద్వారా పారిశుధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న హనుమంతు, లావణ్య రోగుల నుంచి లంచం డబ్బులు డిమాండ్ చేస్తున్నారని రోగులు జిల్డలా కలెక్ట్బ్బుఆర్లు శ్రీహర్షకు ఫిర్యాదు చేశారు.
ఇవ్వని పేషెంట్ బెడ్ల వద్ద క్లీనింగ్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు రోగుల ఫిర్యాదు ద్వారా తెలుసుకున్న కలెక్టర్ వెంటనే సంబంధిత ఔట్ సోర్సింగ్ సిబ్బంది సర్వీసులను టెర్మినెట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య సిబ్బంది హనుమంతు, లావణ్య లను ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో అనుమతించడానికి వీలులేదని కలెక్టర్ గోదావరిఖని జనరల్ ఆసుపత్రి వైద్య సూపరింటెండెంట్ ను ఆదేశించారు.
పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య వసతులను పూర్తి ఉచితంగా అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుంటే ఇటువంటి ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆ లక్ష్యానికి తూట్లు పొడుస్తూ పేద రోగులను ఇబ్బందులకు గురి చేస్తూ జిల్లా యంత్రాంగానికి అవమానకర పరిస్థితులు తీసుకువచ్చారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోగుల దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేసే సిబ్బంది ఇంకా ఎవరైనా ఉంటే గుర్తించి విధుల నుంచి తొలగించాలని లేనిపక్షంలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ లైసెన్సు రద్దు చేయడం జరుగుతుందని కలెక్టర్ సంబంధిత ఏజెన్సీ వర్గాలను హెచ్చరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్ లో భుజం మార్పిడి విజయవంతం

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి (CPR )పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలి: శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్

క్రైస్తవుల జనాభాకు అనుకూలంగా చర్చిలు పెరగాలి - ఉప్పల్ పాస్టర్ ఫెలోషిప్ ఎన్నిక

చురుకైన నాయకత్వాన్ని తీర్చిద్దుతాం - తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నాం - జాగృతి అధ్యక్షురాలు కవిత

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - ఎస్సై శ్రీధర్ రెడ్డి

గాంధీలో హెపటేటిస్ బీ వ్యాక్సినేషన్ - 390 మంది సిబ్బంది వ్యాక్సిన్

ప్రీస్కూల్ ఆక్టివిటీస్ తో చిన్నారులకు మేధాశక్తి పెరుగుతుంది ఐసిడిఎస్ సూపర్వైజర్ శైలజ

దివ్యాంగుల ఆరోగ్య సంరక్షణలో వైద్య నిపుణులకు శిక్షణ

రాష్ర్టపతి నిలయంలో ఘనంగా కార్గిల్ దివస్
.jpg)
వృద్ధుల సంరక్షణకు ఆర్డీవో ఆదేశాలు

ఇది ప్రజాపాలన మంత్రిగారు.... మా కాలనిలోని సమస్యలు తీర్చండి
