ఇందిరమ్మ హౌసింగ్ కాలనీ మౌలిక సదుపాయాలపై అధికారులతో ఎమ్మెల్యే డా సంజయ్ సమీక్ష
జగిత్యాల జులై 24 ( ప్రజా మంటలు)
అర్ డి వో కార్యాలయం లో అర్బన్ హౌసింగ్ ఇందిరమ్మ కాలనీ మౌలిక సదుపాయాల కల్పన పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ....
20వేల మంది నివాస సదుపాయం కోసమే అర్బన్ హౌసింగ్ ఇందిరమ్మ కాలనీ ప్రాజెక్ట్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మౌలిక వసతుల కల్పన కోసం 34 కోట్లను మంజూరు చేయగా నీళ్లు, నీళ్ల ట్యాంకులు, డ్రైనేజీ, సెప్టిక్ ట్యాంకులు, కరెంటు,స్తంభాలు, మెయిన్ రోడ్డు లు తదితర వసతుల కోసం పనులు చేయడం జరిగింది .
4520 ఇండ్ల కోసం అక్కడ నివసించే ప్రజలకు అత్యవసర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం,నేను,అధికారులు నిత్యం కృషి చేస్తున్నాం.
విలీన ప్రాంతాలకు,అర్బన్ హౌసింగ్ ఇందిరమ్మ కాలనీలో మౌలిక వసతుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్లు ఇటీవల మంజూరు చేయడం జరిగింది.
20 కోట్ల నిధులతో మౌలిక సదుపాయాలు అయిన
హాస్పిటల్, స్కూల్స్, కమ్యూనిటీ హాల్, పోలీస్ స్టేషన్ ,బస్టాండ్, అంగన్వాడి కేంద్రం, అర్బన్ హెల్త్ సెంటర్, పార్కులు, ఓపెన్ జిమ్ ,ఇలా అనేక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది.
ఇందిరమ్మ కాలనీ,అర్బన్ హౌసింగ్ కాలనికి అతి త్వరలోనే మౌలిక సదుపాయాలు కల్పిస్తాము .
ప్రాథమిక సదుపాయాల కల్పనకు అవసరమైన స్థలాన్ని అధికారులు గుర్తించాలి. ప్రజలకు అనువైన స్థలంగా ఉండాలీ అన్నారు.
సి డి ఎం ఏ ద్వారా అనుమతి రాగానే త్వరలోనే
టెండర్లు కూడా పిలవడం జరుగుతుందని,అధికారులు ఆదిశగా పనులు చేపట్టాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అర్ డి వో మధుసుధన్,పీడీ హౌసింగ్ ప్రసాద్,
కమిషనర్ స్పందన,ఎమ్మెర్వో రామ్మోహన్, డి ఐ సర్వే విఠల్, డి ఈ మిలింద్, ఏ ఈ లు అనిల్, శరన్,ఎస్.కె కన్సల్టెన్సీ రంగారెడ్డి,రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్ లో భుజం మార్పిడి విజయవంతం

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి (CPR )పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలి: శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్

క్రైస్తవుల జనాభాకు అనుకూలంగా చర్చిలు పెరగాలి - ఉప్పల్ పాస్టర్ ఫెలోషిప్ ఎన్నిక

చురుకైన నాయకత్వాన్ని తీర్చిద్దుతాం - తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నాం - జాగృతి అధ్యక్షురాలు కవిత

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - ఎస్సై శ్రీధర్ రెడ్డి

గాంధీలో హెపటేటిస్ బీ వ్యాక్సినేషన్ - 390 మంది సిబ్బంది వ్యాక్సిన్

ప్రీస్కూల్ ఆక్టివిటీస్ తో చిన్నారులకు మేధాశక్తి పెరుగుతుంది ఐసిడిఎస్ సూపర్వైజర్ శైలజ

దివ్యాంగుల ఆరోగ్య సంరక్షణలో వైద్య నిపుణులకు శిక్షణ

రాష్ర్టపతి నిలయంలో ఘనంగా కార్గిల్ దివస్
.jpg)
వృద్ధుల సంరక్షణకు ఆర్డీవో ఆదేశాలు

ఇది ప్రజాపాలన మంత్రిగారు.... మా కాలనిలోని సమస్యలు తీర్చండి
