ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?
నిరసన తెలిపేందుకు వెళ్లిన జాగృతి కార్యకర్తలపై కాల్పులేంటి?
- తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలి*
తీన్మార్ మల్లన్నపై శాసన మండలి చైర్మన్, డీజీపీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫిర్యాదు
హైదరాబాద్ జూలై 13:
ఆడబిడ్డలను ఎంతగానో గౌరవించే తెలంగాణలో చట్టసభలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి హేయమైన వ్యాఖ్యలు చేయడం దారుణమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై చర్యలు తీసుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం జూబ్లీహిల్స్ లోని చైర్మన్ నివాసంలో గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు లేఖతో పాటు తనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలతో కూడిన పెన్ డ్రైవ్ అందజేశారు.
చైర్మన్ కు ఉన్న విచక్షణ అధికారాలను ఉపయోగించి తీన్మార్ మల్లన్న సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలను శాసన మండలి ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని కోరారు.
తెలంగాణ ఉద్యమంలోనూ కాల్పులు జరపలే
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోన్న రోజుల్లోనూ పోలీసులు, నాయకుల గన్ మెన్లు ఏ ఒక్క రోజు కాల్పులు జరిపిన దాఖలాలు లేవని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదివారం మండలి చైర్మన్ ను కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన నివాసం ఎదుట మీడియాతో మాట్లాడారు. తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు జాగృతి కార్యకర్తలు ఆయన కార్యాలయానికి వెళ్లారని తెలిపారు.
వాళ్లు దాడి చేస్తేనే తమ వాళ్లు ప్రతిదాడి చేశారని.. ఇంతమాత్రానికే గన్ ఫైర్ చేస్తారా అని ప్రశ్నించారు. ఒక ఆడబిడ్డ ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారా అని నిలదీశారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోబోనని తేల్చిచెప్పారు. తాను మామూలు ఆడబిడ్డను కాదు.. అగ్గిరవ్వను అని హెచ్చరించారు.
సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేశారని.. తనపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేసినా సీఎం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యులపై ఒకతీరు.. తెలంగాణ ఆడబిడ్డనైన తన వ్యక్తిత్త హననానికి పాల్పడ్డ వారిపై మరోలా వ్యవహరిస్తారా అని నిలదీశారు. తీన్మార్ మల్లన్నపై సీఎం చర్యలు తీసుకోకపోతే ఈ వ్యాఖ్యలు వెనుక ఆయన ఉన్నారని భావించాల్సి వస్తుందన్నారు. జాగృతి కార్యకర్తలపై కాల్పుల ఘటనను సీరియస్ గా తీసుకోవాలన్నారు.
సీఎం, డీజీపీ వెంటనే స్పందించి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలన్నారు. ఎమ్మెల్సీనైనా తనపై చేసిన వ్యాఖ్యలనే పట్టించుకోకపోతే సాధారణ మహిళల పరిస్థితి ఏమిటన్నారు. తాను ఏడాదిన్నరగా బీసీల కోసం ఉద్యమిస్తున్నానని.. ఏ ఒక్కరోజు కూడా తాను తీన్మార్ మల్లన్నను ఒక్కమాట కూడా అనలేదన్నారు. అలాంటప్పుడు తనపై అనుచిత వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలతో రాజకీయాల్లోకి రావాలంటేనే మహిళలు భయపడే పరిస్థితి ఇలాంటి ఘటనలతో ఉత్పన్నమవుతుందన్నారు. తీన్మార్ మల్లన్న బీసీ కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుందని అనుకోవడం సరికాదన్నారు.
కాల్పుల ఘటన వెనుక ప్రభుత్వమే ఉంది
తెలంగాణ జాగృతి కార్యకర్తల ఘటన వెనుక ప్రభుత్వ హస్తం ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాగృతి కార్యకర్తలపై కాల్పులు, దాడి, తన వ్యక్తిత్తాన్ని హననం చేసేలా వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు. ఆదివారం లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఐజీ రమణ కుమార్ ను కలిసి ఫిర్యాదు అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ, తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై కంప్లైంట్ చెయ్యడానికి డీజీపీ ఆఫీసుకు వచ్చాన్నారు. జాగృతి కార్యకర్తలపై తొపాకులతో కాల్పులు జరిపించింది తీన్మార్ మల్లన్న నా? లేక ప్రభుత్వమా? అనేది తెలియాలన్నారు. సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు. ఇంత పెద్ద ఘటనపై ఫిర్యాదు చేయడానికి వస్తే డీజీపీ ఆఫీస్ కు రాలేదు అంటే దీని వెనుక ప్రభుత్వమే ఉందన్న అనుమానం కలుగుతుందన్నారు. తీన్మార్ మల్లన్న ఆదేశాలతోనే గన్ మెన్ కాల్పులు జరిపారని.. గన్ మెన్లను వెంటనే డిస్మిస్ చేయాలని డమాండ్ చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూత
.jpg)
ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు యూనియన్ నాయకులకు సన్మానం.

అచ్చుబండ పోచమ్మ తల్లి బోనాల జాతర - ప్రైమ్ ఫైట్స్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ
.jpg)
బోనమెత్తిన లష్కర్. - అంగరంగ వైభవంగా ఆషాడ బోనాల వేడుకలు

ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన తొలి జెడ్పి చైర్పర్సన్ వసంత

సీనియర్ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కు నివాళి

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.
.jpeg)
మాజీ మంత్రి రాజేశం గౌడ్ మనమరాలి జన్మదిన సందర్భంగా వాల్మీకి ఆవాసంలో విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు

బోనాల పండుగ నిర్వహణకు చెక్కుల పంపిణీ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయంపై ప్రభుత్వంకు కృతజ్ఞతలు.

హత్య కేసులో నిందితుల అరెస్ట్ - రిమాండ్ కి తరలింపు - సీఐ,రామ్ నరసింహ రెడ్డి
