వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు యూనియన్ నాయకులకు సన్మానం.
జగిత్యాల జూలై 13(ప్రజా మంటలు)
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా శాఖ ఎన్నికల్లో గెలుపొందిన నూతన కార్యవర్గాన్ని ధరూర్ క్యాంపు వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం ఘనంగా సన్మానించారు.
హౌసింగ్ బోర్డ్ గ్రౌండ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి, కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్, ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ, హైదర్ సహాయ కార్యదర్శి చంద్రశేఖర్, చింతల నరేష్ తదితరులను సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, తొగటిగంగాధర్, కొత్త ప్రభాకర్, గాలి పెళ్లి శేఖర్ గౌడ్, సునీల్ విట్టల్, రాజేష్, సాగర్ సుధాకర్ రావు, బెజ్జంకి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
విశ్వకర్మ సత్సంగ్ ఆధ్వర్యంలో..
గురు పౌర్ణమి పురస్కరించుకొని విశ్వకర్మ సత్సంగ్ ఆధ్వర్యంలో స్థానిక పురాణపేట సత్సంగ్ భవనంలో జర్నలిస్టు నాయకులను ఘనంగా సన్మానించారు. విశ్వకర్మ భగవానునికి పూజలు చేసిన అనంతరం సత్సంగ సభ్యులు జర్నలిస్టు యూనియన్ నాయకులను శాలువాతో సన్మానించి జ్ఞాపకాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో సత్సంగ్ అధ్యక్షులు వంగల భాస్కర్, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు టీవీ సత్యం, మాజీ కౌన్సిలర్ మూలస్తం రాజేందర్, సభ్యులు తొగటిగంగాధర్, వంగల మురళి, రంగు రాజయ్య, తుమ్మనపల్లి గంగాధర్, శ్రీపాద నరేష్, వడకాపురం శ్రీనివాస్, రత్నయ్య తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గంగపుత్ర సంఘానికి రూ.4 లక్షల ఎంపీ నిధుల కేటాయింపు

ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూత
.jpg)
ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు యూనియన్ నాయకులకు సన్మానం.

అచ్చుబండ పోచమ్మ తల్లి బోనాల జాతర - ప్రైమ్ ఫైట్స్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ
.jpg)
బోనమెత్తిన లష్కర్. - అంగరంగ వైభవంగా ఆషాడ బోనాల వేడుకలు

ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన తొలి జెడ్పి చైర్పర్సన్ వసంత

సీనియర్ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కు నివాళి

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.
.jpeg)
మాజీ మంత్రి రాజేశం గౌడ్ మనమరాలి జన్మదిన సందర్భంగా వాల్మీకి ఆవాసంలో విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు

బోనాల పండుగ నిర్వహణకు చెక్కుల పంపిణీ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయంపై ప్రభుత్వంకు కృతజ్ఞతలు.
