బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయంపై ప్రభుత్వంకు కృతజ్ఞతలు.
-టీబీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్.
జగిత్యాల జులై 12:
విద్యా,ఉద్యోగ,స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ జారీకి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడం పట్ల టీ బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.ఆదివారం జిల్లా కేంద్రంలో టీ బీసీ జేఏసీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,సీనియర్ సిటీజేన్స్ సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్,జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్,మాజీ మంత్రి టీ.జీవన్ రెడ్డిల ఫ్లెక్సీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ ఇది బీసీ లు సాధించిన విజయమేనని, రిజర్వేషన్ల పెంపునకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్,సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు చిలుక రమేష్,రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగం భాస్కర్,వెల్ముల ప్రకాష్ రావు,మహిళా అధ్యక్షురాలు కస్తూరి శ్రీమంజరి,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల పట్టణంలో విద్యానగర్ లో 11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్
1.jpeg)
రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి. జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.

మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి

దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్

ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ

దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి కుంకుమార్చన

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి
