విద్యుత్ అంతరాయాల పట్ల అప్రమత్తంగా లేకపోతే చర్యలు తప్పవు ఎన్పి డిసిఎల్ ఎస్ఈ సుదర్శనం
మెట్ పల్లి జూలై 4 (ప్రజా మంటలు)
ప్రస్తుత వర్షా కాలంలో బ్రేక్ డౌన్ తదితర సందర్భాల్లో విద్యుత్ అంతరాయాలు ఏర్పడితే సంబంధిత అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సత్వరం స్పందించి మరమ్మతులు చేపట్టక విద్యుత్ పునరుద్ధరణ సకాలంలో చేయకపోతే కఠినమైన చర్యలు తప్పవని జగిత్యాల జిల్లాఎన్పీడీసీఎల్ ఎస్ఈ సుదర్శనం పేర్కొన్నారు.
మెటుపల్లి లో నిర్వహించిన డివిజన్ స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ నిరంతరాయ విద్యుత్ సరఫరా, కొత్త కనెక్షన్లు పౌర సేవా పత్రం అనుసరించి వేగంగా విడుదల చేయడం ప్రధాన అంశాలని, తదనుగుణంగా పురాతన విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్ లలో లోపాలు సరిదిద్ది, నెట్వర్క్ ను ఆధునీకరించాలని, తద్వారా శాశ్వత ప్రాతిపదికన విద్యుత్ వ్యవస్థ ను బలోపేతం చేయాలని, నాణ్యమైన విద్యుత్తును వినియోగదారులకు అందించడానికి ప్రతీ ఒక్కరూ నడుం బిగించాలని సూచించారు.
కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల ను మార్చే ప్రక్రియలో సిబ్బంది విధిగా ఉండాలని, రైతులను అట్టి పనులకు పురమాయించి ప్రమాదాలు కోరి తెచ్చుకోవద్దని అన్నారు.
గత నెలరోజుల్లో మెటుపల్లి డివిజన్ లో సంభవించిన విద్యుత్ ప్రమాదాలు పునరావృతం కాకూడదని, అందుకు సిబ్బంది అన్ని ముందస్తు రక్షణ చర్యలు గైకొనాలని ఆదేశించారు. ప్రతీ రోజు ఉదయం 8 గంటల్లోగా ఏఈలు తమ కార్య క్షేత్రంలో మొత్తం సిబ్బందిని ఒకేచోట సమావేశపరిచి రక్షణ సామగ్రి వాడకంపై అవగాహన కల్పించి విలువైన తమప్రాణాలు, ప్రజలు, పశువుల ప్రాణాల రక్షణకు ప్రతిజ్ఞ చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మెటుపల్లి డీఈ మధుసూదన్, డిఈ టెక్నికల్ గంగారం, ఏడీఈలు మనోహర్, రఘుపతి, ఏఈ లు రవి, ప్రదీప్, శివకుమార్, అజయ్ తదితరులు, ఏఏఓ భూమయ్య, సబ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్
1.jpeg)
రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి. జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.

మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి

దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్

ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ

దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి కుంకుమార్చన

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి

గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి సూచనలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్
