11 ఏండ్ల అభివృద్దిపై ఈనెల 22న ఎగ్జిబిషన్ - ఎంపీ ఈటల రాజేందర్
సికింద్రాబాద్, జూన్ 19 (ప్రజామంటలు):
11 ఏండ్ల బీజేపీ ప్రభుత్వ అభివృద్దిపై ఈనెల 22న సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్ లో ప్రత్యేక ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నట్లు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. గురువారం ఆయన ఇంపీరియల్ గార్డెన్ లో మీడియాతో మాట్లాడారు. మొట్టమొదటిసారిగా బీజేపీ ఎంపీని 4 లక్షల మెజార్టీతో మల్కాసిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు గెలిపించారన్నారు. కేవలం 75 రోజుల్లోనే తనకు విజయాన్ని అందించారని అన్నారు. ఏడాది కాలంలో తన విజయాలు, సమస్యలు పోరాటల అంశాలపై ఎగ్జిబిషన్ లో పొందుపరుస్తామన్నారు.
రాష్ర్ట ప్రభుత్వం ప్రజలను హైడ్రా పేరుతో బయపెట్టిందన్నారు.తాను మొదటి నుంచి పోరాటం చేసే వ్యక్తినని, మూసీ ప్రక్షాళన కోసం ప్రభుత్వం నిరుపేదలను ఇబ్బంది పెట్టే చర్యలను అడ్డుకున్నామన్నారు. సంవత్సర కాలంగా కంటి మీద కునుకు లేకుండా కష్టపడ్డానని, వికాసిత్ భారత్ కార్యక్రమంను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర నాయకులు సునీల్ బన్సారీ, కేంద్రమంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరవుతారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎంపీ ఈటల స్పందించారు.
క్యాబినెట్ లో చర్చ జరిగి, ఆమోదం లేకుండా ఏ పని జరగదన్నారు. కేసీఆర్ మంత్రి వర్గంలో ఉన్నవారే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని అన్నారు. సుందిళ్ళ అన్నారం మేడిగడ్డ ప్రాజెక్ట్ లు రీడీజైన్ లో కేసీఆర్ చేర్చారన్నారు. అవనీతి జరిగితే విచారణ జరపాలని కోరారు. రాష్ర్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటారని నమ్మకం లేదని, అందుకే తాము సీబీఐ విచారణ జరిపించాలని కోరుతున్నామన్నారు. రాష్ర్టంలో గత ప్రాజెక్ట్ లు పార్టీలకు ఏటీఎం లు గా మారాయని ఆరోపించారు. మొదట ఫిల్లర్ లు రిపేర్ చేసి నీళ్ళు ఇచ్చే పని పెట్టుకోవాలని ఎంపీ ఈటల రాష్ర్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సాగునీటి ప్రాజెక్ట్ లు కట్టడం తప్పు కాదని, కాని వాటి పేరుతో అక్రమాలు చేయడం తప్పు అని ఎంపీ ఈటల అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇక పగలు కూడ డ్రంకెన్ ఆండ్ డ్రైవ్ టెస్టులు

జగిత్యాల చిత్రకారుడికి కేంద్ర మంత్రి ప్రశంస

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్ ట్రేడర్స్ అసోసియేషన్ 32వ ఏజీఎమ్

బీసీల 42శాతం రిజర్వేషన్లలో మైనార్టీ ముస్లిం లను చేర్చోద్దు

టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సన్మానించిన పట్టణ బిజెపి, ముస్లిం సెంట్రల్ నాయకులు

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిర్వహణ బాధ్యతలు కొప్పుల ఈశ్వర్ కు అప్పగింత

గంగపుత్ర మత్స్యపారిశ్రామిక సంఘ మండల అధ్యక్షునిగా చిట్యాల రాజేందర్, ఉప అధ్యక్షుడుగా పర్రె రమేష్.

రాష్ట్రంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల ఖరారు

25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం - ఎమ్మెల్సీ కవిత

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఎంపీలకు ఆహ్వానం
