రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా, నంబర్ ప్లేట్ దాచినా లేదా కొన్ని నంబర్లు తొలగించినా ఇక పై కేసులు నమోదు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్
జగిత్యాల జూన్ 19 (ప్రజా మంటలు)
నెంబర్ ప్లేట్స్ సరిగా లేని 306 వాహనాలను సీజ్.
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మధ్యాహ్నం 4 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ నంబర్ లేని, నంబర్ ప్లేట్ దాచి,కొన్ని నంబర్లు తొలగించిన వాహనాలను గుర్తించేందుకు పోలీస్ అధికారులు , సిబ్బంది వివిధ టీంలు గా ఏర్పడి ఏక కాలంలో ముమ్మర తనిఖీ లు చేసారు. వాహనాల తనిఖీ చేయగా ఇందులో సరైన నెంబర్ ప్లేట్స్ లేని 306 వాహనాలను సీజ్ చేయడం జరిగింది.
నెంబర్ ప్లేట్స్ సరిగా లేని వాహనాలను, నెంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి వాటికి సరైన నెంబర్ ప్లేట్లను బిగించిన తర్వాత వాహనాలను విడిచి పెట్టడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... నిబందనలకు విరుద్దంగా , ఇష్టారీతిన వాహన నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేయడం కొందరు వాహనదారులు ట్రాఫిక్ ఈ చలాన్ నుంచి తప్పించుకోవడం కోసం వాహనాలపై ఫ్యాన్సీ నంబర్ తో పాటు తప్పుడు నంబర్ లు సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయా నంబర్ ప్లేట్లపై వివిధ ఆకారాలు, డిజైన్లు, పదాలు, అక్ష రాలు గుర్తించలేనంతగా ఉంటున్నాయి. కొందరు కావాలనే వాటిని తొలగించడం, నంబర్ గుర్తించకుండా నెంబర్ ప్లేట్ విరగ్గొట్టడం చేస్తున్నారు. ఇలాంటి వారు వాహన తనిఖీల్లో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
జిల్లా పరిదిలోని ప్రజలు అందరు పోలీస్ వారికీ సహకరించి తమ వాహనాల నెంబర్ ప్లేట్స్ నిబందనల ప్రకారం బిగించు కోవాలని, లేని పక్షం లో వాహనాలపై నంబర్ లేకుండా, నిబందనలకు విరుద్దంగా నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసి వాహనం నడిపితే వాహనదారుడి పై ఛీటింగ్ కేసులను నమోదు చేయబడుతాయని ఎస్పి వాహనదారులకు సూచించారు.
నెంబర్ ప్లేట్ లేని వాహనాలను ఉపయోగించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న దృష్ట్యా ఈ యొక్క తనిఖీలు నిరంతర నిర్వహించడం జరుగుతుందని కావున జిల్లా పరిదిలోని ప్రజలు అందరు పోలీస్ వారికి సహకరించాలని కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇక పగలు కూడ డ్రంకెన్ ఆండ్ డ్రైవ్ టెస్టులు

జగిత్యాల చిత్రకారుడికి కేంద్ర మంత్రి ప్రశంస

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్ ట్రేడర్స్ అసోసియేషన్ 32వ ఏజీఎమ్

బీసీల 42శాతం రిజర్వేషన్లలో మైనార్టీ ముస్లిం లను చేర్చోద్దు

టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సన్మానించిన పట్టణ బిజెపి, ముస్లిం సెంట్రల్ నాయకులు

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిర్వహణ బాధ్యతలు కొప్పుల ఈశ్వర్ కు అప్పగింత

గంగపుత్ర మత్స్యపారిశ్రామిక సంఘ మండల అధ్యక్షునిగా చిట్యాల రాజేందర్, ఉప అధ్యక్షుడుగా పర్రె రమేష్.

రాష్ట్రంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల ఖరారు

25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం - ఎమ్మెల్సీ కవిత

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఎంపీలకు ఆహ్వానం
