శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో వెండి బంగారు వస్తువుల చోరీ
జగిత్యాల జూన్ 11 (ప్రజా మంటలు)
పట్టణంలోని నిజామాబాద్ రోడ్ మంచినీళ్ళ భావి వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ మడే లేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి దొంగలు ఆలయ ద్వారము తాళాలు పగలగొట్టి పలు విలువైన వెండి వస్తువులను అమ్మవారికి చెందిన పలు పుస్తెలు మట్టెలు అపహరించారు.
హుండీ తాళం తెరువ రాకపోవడంతో వదిలివేశారు. గర్భాలయం సెంట్రల్ లాక్ తెరవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఇనుప రాడ్ తో తాళాలు పగలగొట్టినట్లుగా ఇనుపరాడు ఆలయ ఆవరణలో లభ్యమయింది.
ఇదిలా ఉండగా ఆలయ అర్చకులు ఉదయం ఆలయం తెరవడానికి వెళ్ళినప్పుడు తాళాలు పగలగొట్టి ఉండడం చూసి వెంటనే ఆలయ అధ్యక్షులు బోరుగళ్ల దేవరాజ్ కు సమాచారం అందించారు.
ఆలయాన్ని చేరుకున్న ఆలయ అధ్యక్షులు స్థానిక పోలీసులకు100 ద్వారా ఫోన్ చేశారు . వెంటనే క్లూస్ టీం ఆలయానికి చేరుకొని పగిలిన తాళాలను ద్వారమును హుండీని సాంకేతిక సహాయంతో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు మాట్లాడుతూ మినీ ట్యాంక్ బండ్ (చింతకుంట) మరియు ఆలయాన్ని ఆనుకొని లారీలు నిలుపుతున్నారని దీంతో అసాంఘిక కార్యకలాపాలు జరగడమే కాకుండా పలుమార్లు ఆలయంలో చోరీలు కూడా జరిగినట్లు తెలిపారు. ఇప్పటికైనా లారీలను ఆలయ ప్రాంతంలో మరియు ఐలమ్మ బతుకమ్మ విగ్రహాల వద్ద నిలుపకుండా చూడాలని అధికారులకు ఆలయ అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం
