విద్యార్థుల బస్ పాస్ ఛార్జీల పెంపు సరికాదు - ఏబీవీపీ ఆందోళన
సికింద్రాబాద్, జూన్ 11 ( ప్రజామంటలు):
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్-కూకట్పల్లి విభాగ్, సికింద్రాబాద్ జిల్లా, ఎస్ ఆర్ నగర్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల బస్ పాస్ చార్జీలను పెంచే ఆలోచనను విరమించుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ చెర్క బాలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చెయ్యలేకపోవడమే కాక పేద,బడుగు బలహీన వర్గాల విద్యార్థులను విద్యకు దూరం చెయ్యాలని ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. ప్రజా పాలన అంటూ పేదల పెన్నిధి అంటూనే ఇలాంటి ప్రతిపాదనల ద్వారా పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తుందన్నారు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తెచ్చి 400 నుండి 600 రూపాయలు బస్ చార్జీలను పెంచడం దాదాపుగా ఒకేసారి 20 నుండి 25 శాతం పెంచడమే కాక గత మూడు సంవత్సరాల్లో 200శాతం ఫీజు పెంచడం సరికాదని అన్నారు.కావున వెంటనే ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకొని పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఊరట కల్పించాలని లేని పక్షంలో రాష్ట్రమంతా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఎస్ఎఫ్డీ సిటి కన్వీనర్ పాండురంగ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం కావాలనే పేద,మధ్య తరగతి విద్యార్థులను విద్యకు దూరం చేయడమే లక్ష్యంగా ఈ బస్ చార్జీలను 20శాతం పెంపు నిర్ణయాన్ని తీసుకుందని ఆరోపించారు. ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులను విద్యకు దూరం చేయాలని సిగ్గుమాలిన చర్యను మానుకొని బస్సు ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెన్నక్కి తీసుకొని సామాన్య మధ్యతరగతి విద్యార్థులను విద్యను అందుకునే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ నగర్ టౌన్ సెక్రటరీ నందు,సోహాన్ కుమార్ , నగర కార్యకర్తలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం

శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ లెక్కింపు

విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

హెచ్ టి సర్వీసుల మంజూరుకు సింగిల్ విండో వ్యవస్థ

ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ రమణ
.jpg)
రాయపట్నం గ్రామంలో గంజాయి పట్టివేత
.jpeg)
ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు

మైనర్ బాలికపై అత్యాచారం కేసులలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష

ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం

విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యాబోధన అందించాలి

లబ్ధిదారుల గ్రామలకు వెళ్లి కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్
