పంతులు దీక్ష ఫలించింది...బడికి బాట దొరికింది
మీడియా ప్రభావం - వార్త వేసిన 24 గంటల్లో....
దారికి అడ్డంగా ఉన్న గోడను కూల్చివేసిన హైడ్రా
*ఏడాదిగా దొరకని పరిష్కారం...24 గంటల్లో అయింది...
సికింద్రాబాద్ మే 27 (ప్రజామంటలు):
సికింద్రాబాద్‌లోని చిలకలగూడ దూద్‌బావి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దారికి అడ్డంగా నిర్మించిన గోడను హైడ్రా, జీహెచ్ఎమ్సీ అధికారులు మంగళవారం కూల్చివేశారు. సోమవారం సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ నార్త్ జోన్ కార్యాలయం ఎదుట ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్ రెడ్డి సీఎం గారు....! మా బడికి బాట వేయించండి.. అంటూ ప్లకార్డు పట్టుకుని ధర్నాకు దిగిన వార్త మీడియాలో ప్రసారం కావడంతో హైడ్రా రంగంలోకి దిగింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో ఇన్‌స్పెక్టర్ ఆదిత్య క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆ పాఠశాలకు వెళ్లే మార్గంలో అక్కడి నివాసితులు దారికి అడ్డంగా గోడను నిర్మించినట్లు, .దీంతో విద్యార్థులు స్కూల్ కు వెళ్లడానికి పక్కనే ఉన్నచిన్నపాటి గల్లి నుంచి వస్తున్నట్లు గుర్తించారు. విద్యార్తులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకుగాను దారికి అడ్డంగా నిర్మించిన ప్రహరీని తొలగించారు. జీహెచ్ ఎంసీ టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్‌రావుతో పాటు సిబ్బంది కూడా ఉండి అడ్డు గోడ తొలగింపు పనులను పర్యవేక్షించారు.
ప్రహరీ గోడతొలగించిన చోట గేటు కూడ ఏర్పాటు చేస్తామని జోనల్ కమిషనర్ రవి కిరణ్‌వెల్లడించారు. తమ విజ్ఞప్తికి వెంటనే స్పందించి, స్కూల్ కు దారిని కల్పించిన ముఖ్యమంత్రి, హైడ్రా, జీహెచ్ఎమ్సీ అధికారులతో పాటు మీడియాకు హెడ్మాస్టర్ మల్లికార్జున్ రెడ్డి, స్డూటెంట్స్ పేరేంట్స్ కృతజ్ఞతలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
టీపీసీసీ రాష్ట్ర సలహా కమిటీ లో జగిత్యాల టైగర్ టి. జీవన్ రెడ్డి కి చోటు.
.jpeg)
ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు – డాక్టర్ మిట్టపల్లి సృజల

రూ.వంద కోట్లతో రాంగోపాల్ పేట డివిజన్ ను అభివృద్ది చేశాం

చిన్నపాటి వర్షానికే నీట మునిగిన రహదారి

విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంస ప్రోత్సాహకాలు

మానసిక వేదనతోనే పంచాయతీ కార్యదర్శి మృతి. రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు బలరాం.

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా నెలవారీ క్రైమ్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అభివృద్ధి నిరంతర ప్రక్రియ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల ఇవ్వరా?

మహిళా సాధికారితకు స్ఫూర్తి రాణి "అహల్యాబాయి "

ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయండి

ఉచిత ఆస్తమా వ్యాధి నివారణ ఆయుర్వేద మందు
