నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్
*సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జీ అదం సంతోష్
*సన్న బియ్యంతో వండిన అన్నం తిన్న సంతోష్
సికింద్రాబాద్, మే01 ( ప్రజామంటలు):
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆహార భద్రత కార్డు కలిగిన పేద కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయడం వరంలాంటిదని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ అదం సంతోష్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గములో గురువారం నిరుపేద కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన సన్న బియ్యం పథకం ఎంతో చేయూత ఇస్తుందని, రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబంలోని సభ్యులకి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేయడం జరుగుతుందని, పది సంవత్సరాలు రేషన్ కార్డులు పంపిణీ చేయక పేద కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడ్డాయని ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కార్డులు అందుతాయని పేర్కొన్నారు. కార్డులు కలిగిన వారందరికీ సన్న బియ్యం అందించడం జరుగుతుందని తెలిపారు. పేదలకు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అదం సంతోష్ బౌద్ధ నగర్ డివిజన్ సంజీవ పురంలో సన్నబియ్యం లబ్ధిదారు లలిత ఇంట్లో భోజనం చేశారు, షకీల్ ఖాన్, డివిజన్ అధ్యక్షులు అనిల్, బ్రహ్మాజీ, అభిషేక్, రవి, జలందర్ రెడ్డి, కిషోర్ యాదవ్, రవి శంకర్, వహీద్, శ్రీనివాస్, బబ్లూ, చక్రి, అబ్బు బాయి, హరి, ప్రభాకర్, రాధ, కల్పన, రమణి, రాంలీలా పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కార్మిక చట్టాలు ఉపయోగించుకుంటేనే ప్రయోజనాలు -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు

ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
.jpg)
గ్రూప్-1,గ్రూప్-3 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి కృషి చేసిన అదనపు ఎస్పీ కి ప్రసంశ పత్రం

నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పి అశోక్ కుమార్

భూ భారతి పై పోలీస్ అధికారులకు జగిత్యాల ఆర్ డి ఓ చే అవగాహన కార్యక్రమం

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం
