కార్మిక చట్టాలు ఉపయోగించుకుంటేనే ప్రయోజనాలు -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు
మెట్ పల్లి మే 01
మండల న్యాయప్రాధికార సంస్థ చే న్యాయ విజ్ఞాన సదస్సు
కార్మిక చట్టాల గూర్చి తెలుసుకుంటే ప్రయోజనం లేదని, వాటిని ఉపయోగించుకుంటేనే లాభాలు ఉంటాయి అని మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. గురువారం మే డే, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన ముఖ్య అతిధి గా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇన్సూరెన్స్ గూర్చి, ప్రావిడెంట్ ఫండ్ గూర్చి మన దేశంలో అనేక చట్టాలు కార్మికులు మరియు ప్రజల కోసం సిద్ధంగా ఉన్నప్పటికీ, వాటిని సద్వినియోగం చేసికోవడానికి మనం చట్టప్రకారం నిబందనలు సైతం పాటించాలని పేర్కొన్నారు. నిబందనలు పాటించకుండా చట్టాల నుండి ప్రయోజనాల్ని పొందలేం అని అన్నారు.
అనంతరం సీనియర్ న్యాయవాదులు రాజ్ మహ్మద్, మగ్గిడి వెంకట నర్సయ్య, తుల గంగవ్వ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు, న్యాయవాది తుల రాజేందర్,కోటగిరి వెంకటస్వామి, దయ్యా రాజారాం, గడ్డం శంకర్ రెడ్డి వివిధ కార్మిక చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షులు తోగిటి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, జాయింట్ కార్యదర్శి గజేల్లి రాందాస్ కార్యవర్గం సభ్యులు కట్టా నర్సాగౌడ్, ఓగులపు శేఖర్, అలాల సత్యనారాయణ, మన్నె గంగాధర్, గురిజెలా గోపి, గజభీంకార్ వెంకటేష్, కార్మిక కార్యాలయ జూనియార్ అసిస్టెంట్ గణేష్, కార్మిక నాయకులు ఉస్మాన్, ఎఎస్సయ్ సత్యనారాయణ మరియు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కార్మిక చట్టాలు ఉపయోగించుకుంటేనే ప్రయోజనాలు -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు

ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
.jpg)
గ్రూప్-1,గ్రూప్-3 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి కృషి చేసిన అదనపు ఎస్పీ కి ప్రసంశ పత్రం

నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పి అశోక్ కుమార్

భూ భారతి పై పోలీస్ అధికారులకు జగిత్యాల ఆర్ డి ఓ చే అవగాహన కార్యక్రమం

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం
