కాశి బాగ్ హనుమాన్ ఆలయంలో జరుగుతున్న అవకతవకలపై మహిళల ఆగ్రహం.
మెట్టుపల్లి ఏప్రిల్ 20 (ప్రజా మంటలు దగ్గుల అశోక్)'
మెట్ పల్లి పట్టణంలోని కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు కార్యాలయం వద్ద, ఇందిర నగర్ కాలనీకి చెందిన మహిళలు బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... ఇందిరానగర్ ప్రాంతంలోని కాశి బాగ్ హనుమాన్ దేవాలయంలో జరుగుతున్న అవకతవకలపై జువ్వాడి నర్సింగరావుకు ఫిర్యాదు చేయడానికి వస్తే నర్సింగరావు లేకపోవడంతో మహిళలు అసహనానికి లోనై కార్యాలయం వద్ద బైఠాయించారు.
ఆలయ కమిటీ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైనటువంటి యమ రంజిత్ అనే వ్యక్తి ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తూ ఆలయంలోని హుండీ ఆదాయాన్ని, హనుమాన్ జయంతి రోజు జరిగిన అన్నదానం కార్యక్రమంలో మిగిలిన బియ్యాన్ని ఇతర వస్తువులను ఆలయ కమిటీకి తెలపకుండానే తాను తీసుకువెళ్లినట్టు మహిళలు ఆరోపించారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రతి శనివారం జరుగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని నిలిపివేయడంతో ఆగ్రహానికి లోనైతునట్లు మహిళలు అన్నారు.
గత మూడు రోజుల క్రితం వీచిన గాలి వానల వల్ల ఆలయంలో కరెంటు లేక చీకట్లోనే దేవుడికి కార్యక్రమాలు జరుగుతున్నట్లు మహిళలు తెలిపారు. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన చైర్మన్ పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిని చైర్మన్ గా జువ్వాడి నర్సింగరావు నియమించాడు కాబట్టి ఆలయంలో జరుగుతున్నా అవకతవకలపై ఫిర్యాదు చేయడానికి వచ్చామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యామ రాజయ్య నర్సింగరావు తో మాట్లాడి జరుగుతున్న అవకతవకలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మహిళలు వెనుదిరిగారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బి బి కే క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కాంతా కుమారి

పుణ్యప్రదం పుష్కర స్నానం. - నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు .
.jpeg)
పలు విభాగాల్లో యువతీ,యువకులకు ఉచిత శిక్షణ

ధర్మపురిi దేవస్థానంలో సాంప్రదాయాలకు తిలోదకాలు... ఇష్టారాజ్యంగా చిత్రీకరణలు

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి

గుర్తు తెలియని వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో మృతి

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

దేవాలయ వైశాల్యం పెంచడమే అభివృద్ధి కాదు భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధిగా భావించాలి రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ

ఘనంగా ముగిసిన శ్రీ మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు

మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు తప్పదు *మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి నాలుగు రోజులు జైలు శిక్ష*_ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం

మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై_ నాన్ బెయిలబుల్ కేసు నమోదు-పట్టణ సిఐ. వేణుగోపాల్...

ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు, సలహాల కోసం డయల్ యువర్ డిఎం సద్వినియోగపరచుకోండి
