వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి
బిజెపి మల్యాల మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం
గొల్లపల్లి ఎప్రిల్ 15 (ప్రజా మంటలు):
వరికోతలు ప్రారంభం అయి ఇరవై రోజులు గడిచాయని రైతులు దాన్యాన్ని కేంద్రాలలో కుప్పలు తెప్పలుగా పోశారని అయినా ప్రభుత్వం ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభిచక పోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం,అధికారులు వెంటనే స్పందించి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చెయ్యాలని బిజెపి మల్యాల మండల అధ్యక్షులు గాజుల మల్లేశం డిమాండ్ చేశారు.
మండలంలో సగానికి పైగా వరి కోతలు పూర్తి అయ్యాయని కానీ ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల మిల్లర్లు ఆసరాగా చేసుకొని రైతులు ఆరుగాలం పండించిన పంటను 1800 నుండి 2000 లోపు తక్కువధరకు కొనుగోలు చేసి రైతులను నిండా ముంచుతున్నారని అన్నారు.
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంటలు పాక్షికంగా దెబ్బ తిన్నాయని మల్లి అకాల వర్షాలు సంభవిస్తే ఆరబోసిన ధాన్యం కూడా తడిసె ప్రమాదముందని దానివల్ల రైతులు మరింత నష్టపోయే అవకాశం ఉందని ప్రభుత్వం, అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధరూర్ క్యాంప్ ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు

సిరిసిల్ల TV9 రిపోర్టర్ ప్రసాద్ మృతి

ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు

శాకంబరి దేవిగా ఉజ్జయిని మహాకాళి

పద్మారావునగర్ లో ఘనంగా శ్రీసాయి సప్తాహం ప్రారంభం

ఈనెల 7న ఎమ్మార్పీఎస్ 31 వ వార్షికోత్సవం - ఘనంగా నిర్వహించుకోవాలని నేతల పిలుపు..

ఆధునిక వైద్య విధాన పద్దతులతో మెరుగైన భోదన

కోరుట్ల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీని కలిసి పూల మొక్క అందజేత

విద్యుత్ అంతరాయాల పట్ల అప్రమత్తంగా లేకపోతే చర్యలు తప్పవు ఎన్పి డిసిఎల్ ఎస్ఈ సుదర్శనం
.jpg)
జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్యకు ఘన నివాళులు
