వరంగల్ సభకు దండుకట్టండి - మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
పాతికేళ్ల పార్టీ సభ దద్దరిల్లాలి
గ్రామ గ్రామాన గులాబీ జెండా ఎగరాలి
- మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్*
ధర్మపురి ఎప్రిల్ 12:
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ధర్మపురి నియోజకవర్గం నుంచి గులాబీ శ్రేణులంతా దండుకట్టాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు.
పార్టీ పాతికేళ్ల సభ కనీవినీ ఎరుగని రీతిలో జయప్రదం చేయాలని ఆయన కోరారు. ధర్మపురి నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ధర్మపురి పట్టణంలోని SH గార్డెన్ లో జరిగింది.సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సభ విజయవంతానికి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ గా పుట్టి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం 25 సంవత్సరం లో విజయవంతంగా అడుగు పెడుతున్న సందర్భంగా అధినేత కేసీఆర్ గారి పిలుపు మేరకు ఎప్రిల్ 27 న నిర్వహించబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఏప్రిల్ 27 గులాబీ పార్టీ పండుగ రోజని, ఆ రోజు గ్రామ గ్రామాన గులాబీ జెండాలు రెపరెపలాడాలని,ఈ ఎన్నికల్లో కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్లీ గెలవడం ఖాయమణి, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అంశాల్లో విఫలమవుతోందni, హామీల అమలు దగ్గర నుంచి, పాలనా పరమైన నిర్ణయాల వరకు అభాసుపాలవుతోందని విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తే సహించేది లేదని.. కార్యకర్తలకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, వివిధ మండలాల పార్టీ బాధ్యులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

సిఐటియూ ఆధ్వర్యంలో ఘనంగా 139వ మేడే వేడుకలు

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్.

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి
