ట్యాంక్ బాండ్ పై  మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాటును స్వాగతిస్తున్నాం

అసెంబ్లీ ఆవరణలో విగ్రహం పెట్టేవరకు పోరాడుతాం - బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

On
ట్యాంక్ బాండ్ పై  మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాటును స్వాగతిస్తున్నాం

పట్టు సడలిస్తే సాధించుకున్న 42 శాతం బీసీ రిజర్వేషన్లను అటకెక్కించే ప్రమాదం ఉంది 

అసెంబ్లీలో బిల్లు పాస్‌ చేయడంతోనే అంతా అయిపోలేదని. ఢిల్లీలో రాష్ట్రపతి ఆమోదం పొందే వరకు యుద్ధం కొనసాగించాల్సిందే

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి బీసీలకు 42 రిజర్వేషన్లు కల్పించేందుకు చిత్తశుద్ధితో పోరాడాలి 

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

హైదరాబాద్‌ ఏప్రిల్ 11:

మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా కార్వాన్‌ చౌరస్తాలోని ఫూలే విగ్రహానికి బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆమె శుక్రవారం నివాళులర్పించారు.IMG-20250411-WA0038 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కవిత మాట్లాడుతూ, తెలంగాణ జాగృతి, యునైటెడ్‌ ఫూలే ఫ్రంట్‌, బీసీ సంఘాల ఐక్య పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలన్న సర్కారు నిర్ణయం మంచిదేనని, అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ 48 గంటల పాటు నిరాహార దీక్ష చేసి ఉమ్మడి రాష్ట్రంలోనే సాధించుకున్నామని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ జాగృతి సామాజిక న్యాయం కోసం ప్రజల పక్షాన ఉద్యమిస్తున్న సంస్థ అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని సాధించుకున్న స్ఫూర్తితోనే మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఉద్యమిస్తున్నామని అన్నారు. ''మేమెంతో మాకంత'' అనే నినాదంతో బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి కొంత వరకు సాకారం చేసుకున్నామని తెలిపారు. ప్రభుత్వం ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది కదా అని మనం పట్టు సడలిస్తే సాధించుకున్న 42 శాతం బీసీ రిజర్వేషన్లను అటకెక్కించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అసెంబ్లీలో బిల్లు పాస్‌ చేయడంతోనే అంతా అయిపోలేదని, ఢిల్లీలో రాష్ట్రపతి ఆమోదం పొందే వరకు యుద్ధం కొనసాగించాల్సిందేనని అన్నారు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తేనే బీసీల రిజర్వేషన్లు పెరుగుతాయన్న విషయం గుర్తించాలన్నారు.

అప్పటి వరకు రిజర్వేషన్ల సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాల్సిందేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి బీసీలకు 42 రిజర్వేషన్లు కల్పించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సరిగా జరగలేదని అనేక ఫిర్యాదులు ఉన్నాయన్నారు. తమ కుటుంబాల వివరాలు సేకరించలేదని లక్షలాది మంది చెప్తున్నారని అన్నారు. ప్రభుత్వం చేసిన కుల సర్వే వివరాలు గ్రామాలు, వార్డుల వారీగా బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. అంతకుముందు మింట్‌ కాంపౌండ్‌ లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి బీసీ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ కవిత పూలమాల వేసి నివాళులర్పించారు.

*బీసీ రిజర్వేషన్ల పెంపునకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి*

రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్‌ లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ బిల్లు ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ రిజర్వేషన్లను నిజం చేసేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఎంబీ భవన్‌ లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీతో ఆమె భేటీ అయ్యారు.  అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాటుకు మద్దతునివ్వాలని కోరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, బహుజనుల సాధికారతకు ప్రతీకగా పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్టించాలని కోరుతున్నామని చెప్పారు. ఇదే డిమాండ్‌ తో తాము అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల మద్దతు కూడగట్టామన్నారు.

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ ల అమలుతోనే రిజర్వేషన్ల అమలుకు ఉన్న 50 శాతం పరిమితి అడ్డంకి తొలగిపోయిందన్నారు. ఇప్పటికే తొమ్మిది రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడం కష్టతరమేమి కాదన్నారు. ఈ బిల్లును కేంద్రం ఆమోదించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలన్నారు. వెంటనే ప్రధాన మంత్రి అపాయింట్‌మెంట్‌ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు.

కవిత పోరాటానికి మద్దతు : జాన్‌ వెస్లీ

IMG-20250411-WA0028

అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జాగృతి పోరాటానికి పూర్తి మద్దతు తెలుపుతున్నానని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ ప్రకటించారు. అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన అభినందనీయమన్నారు. కుల అసమానతలను నిర్మూలించకుండా దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్లదనేది తమ నమ్మకమని తెలిపారు. కుల అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాల్సిందేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కులగణన వివరాలను బహిర్గతం చేయాలన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ప్రకటించారు. 

ఈ కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, యునైటెడ్ ఫులే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రాంచందర్, కో కన్వీనర్ బొల్ల శివ శంకర్, యుపిఎఫ్ నాయకులు అలకుంటల హరి, కొట్టాల యాదగిరి,ఎత్తరి మారయ్య,  గోపు సదనందు, విజేందర్ సాగర్ ,రాచమల్ల బాలకృష్ణ , డి కుమారస్వామి, కోల శ్రీనివాస్,డి నరేష్ కుమార్, గురం శ్రవణ్, ఏల్చాల దత్తాత్రేయ, రామ్ కోటి, గొరిగే నర్సింహ , అశోక్ యాదవ్ ,లింగం శాలివాహన, పుష్ప చారి , మధు,విజయ్ జితేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

కార్మిక చట్టాలు ఉపయోగించుకుంటేనే ప్రయోజనాలు -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు

కార్మిక చట్టాలు ఉపయోగించుకుంటేనే ప్రయోజనాలు  -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు మెట్ పల్లి మే 01  మండల న్యాయప్రాధికార  సంస్థ చే న్యాయ విజ్ఞాన సదస్సు కార్మిక చట్టాల గూర్చి తెలుసుకుంటే ప్రయోజనం లేదని, వాటిని ఉపయోగించుకుంటేనే లాభాలు ఉంటాయి అని మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. గురువారం మే డే, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మండల లీగల్...
Read More...
Local News 

ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ మెటుపల్లి మే 01: ఎండవేడి తట్టుకొని కనీస అవసరకోసం పనిచేస్తున్న ఉపాధి హామీ కార్మికులను సహృదయంతో ఆడుకోవడానికి ముందుకొచ్చిన న్యాయవాది. చౌలమద్ది  తులానగర్  లో  ఉపాధి హామీ కూలీలకు చల్లటి మజ్జిగ పాకెట్స్ ను తుల గంగవ్వ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు డా. తుల రాజేందర్ అందించారు.
Read More...
Local News 

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 1( ప్రజా మంటలు) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా కుల గణన చేపట్టి,బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా,అసెంబ్లీ లో కుల గణన పై ఆమోదం తెలిపి దేశానికి దిక్సూచిగా...
Read More...
Local News 

గ్రూప్-1,గ్రూప్-3 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి కృషి చేసిన అదనపు ఎస్పీ కి  ప్రసంశ పత్రం

గ్రూప్-1,గ్రూప్-3 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి కృషి చేసిన అదనపు ఎస్పీ కి  ప్రసంశ పత్రం                                 సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 1(ప్రజా మంటలు)జిల్లాలో గ్రూప్-1, గ్రూప్-3 2024 పరీక్షలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇతర శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన జిల్లా పోలీస్ నోడల్ అధికారి అధనవు ఎస్పీ  భీమ్ రావు కి అప్పటి TGPSC  చైర్మన్ మహేందర్ రెడ్డి ఐపీఎస్.,  ప్రశంస పత్రాలను అందజేశారు....
Read More...
Local News 

నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పి  అశోక్ కుమార్

నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పి  అశోక్ కుమార్                        సిరిసిల్ల . రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 1(ప్రజా మంటలు)   విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంస  ప్రోత్సాహకాలు.జగిత్యాల మే 1(ప్రజా మంటలు)  జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  అధ్యక్షతన నేరాల సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో డీఎస్పీలు, సి.ఐ లు వివిధ   ఈ...
Read More...
Local News 

భూ భారతి పై పోలీస్ అధికారులకు జగిత్యాల  ఆర్ డి ఓ చే అవగాహన కార్యక్రమం

భూ భారతి పై పోలీస్ అధికారులకు జగిత్యాల  ఆర్ డి ఓ చే అవగాహన కార్యక్రమం                     సిరిసిల్ల . రాజేంద్ర శర్మ    జగిత్యాల మే 1 ( ప్రజా మంటలు)రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా  తీసుకువచ్చిన భూ భారతి- 2025 చట్టంపై పోలీస్ అధికారులకు అవగాహన పెంచే ఉద్దేశంతో జిల్లా పోలీస్ కార్యాలయంలో జగిత్యాల  ఆర్డి ఓ చే  ప్రత్యేక శిక్షణా శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పి  అశోక్ కుమార్...
Read More...
Local News 

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి.. సికింద్రాబాద్, మే01 (ప్రజా మంటలు): ఉద్యోగులు తమ ఉద్యోగ పదవీకాలంలో నిబద్దతతో చేసిన విధులు తమకు గుర్తింపునిస్తాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ మహ్మాద్ నయీమ్ ఖాన్  రిటైర్మెంట్ వీడ్కోలు సమావేశంలో గురువారం జరిగింది. ఈసందర్బంగా పలువురు మహ్మాద్ నయీమ్ ఖాన్ ను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆయన శేషజీవితం...
Read More...
Local News 

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక సికింద్రాబాద్  మే 01 (ప్రజా మంటలు):  సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని గంభీర్ పూర్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నూతన ఎన్నికలు నిర్వహించారు.ఈ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మ్యాదరి నర్సింలు,క్యాషియర్ గా బైండ్ల బాలరాజు ను,కార్యదర్శిగా నిరటి నర్సింలు,గౌరవ సభ్యులు జక్కుల రాజు చిన్న,...
Read More...
Local News 

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి సికింద్రాబాద్,  మే 01 (ప్రజా మంటలు): సీఎం నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి కోరారు. గురువారం బన్సీలాల్‌పేట డివిజన్‌లోని పలు రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం కిలో కి రూ....
Read More...
Local News 

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం - అదం సంతోష్

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం - అదం సంతోష్ *సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జీ అదం సంతోష్ *సన్న బియ్యంతో వండిన అన్నం తిన్న సంతోష్ సికింద్రాబాద్, మే01 ( ప్రజామంటలు): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆహార భద్రత కార్డు కలిగిన పేద కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయడం వరంలాంటిదని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ అదం సంతోష్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గములో  గురువారం నిరుపేద కుటుంబాలకు...
Read More...
Local News 

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్ 

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్  సికింద్రాబాద్, మే 01 (ప్రజా మంటలు): వేసవి సెలవులు నేపథ్యంలో గణిత నిపుణులు రాజాగా పేరుగాంచిన రాజా నర్సింహారావు సిటీలోని ఆశ్రయ  హోమ్స్ ఫర్ గర్ల్స్ రెయిన్ బో హోమ్స్ వేసవి శిబిరంలో మాథ్స్ వర్క్ షాప్ నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన స్టూడెంట్స్ కు గణిత శాస్త్రంలో   మెళకువలు ,టెక్నిక్స్ పై అవగాహన కల్పించారు,...
Read More...
Local News 

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం గొల్లపల్లి మే 01 (ప్రజా మంటలు): నిన్న ప్రకటించిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మల్లన్న పేట పాఠశాల విద్యార్థులు 28 మంది విద్యార్థులకు గాను 28 మంది విద్యార్థులు పాసై 100% ఉత్తీర్ణతను సాధించారు.ఇందులో 8 మంది విద్యార్థులు 500 కు పైగా మార్కులు సాధించారు.గొల్లపల్లి మండలంలో, ప్రభుత్వ & స్థానిక...
Read More...