కేంద్ర ప్రభుత్వం వెంటనే బిసి రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి - బర్ల మణి మంజరి సాగర్
- బిసి మహిళ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బర్ల మణి మంజరి సాగర్
హైదరాబాద్ ఏప్రిల్ 04:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చేసిన తీర్మానం మేరకు కేంద్ర ప్రభుత్వం వెంటనే బిసి బిల్లును ఆమోదించాలని బిసి మహిళ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బర్ల మణి మంజరి సాగర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ లో శుక్రవారంనాడు విలేకరులతో బర్ల మణి మంజరి సాగర్ మాట్లాడుతూ, విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిసి బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం హర్షనీయమనీ, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదించాలని డిమాండ్ చేశారు.
దేశంలో బిసిల జనాభా 60 శాతం ఉంటుందని, అయితే అధికారికంగా ఆ లెక్కలను తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టినట్లుగా దేశవ్యాప్తంగా కుల గణన చేసి జనాభా ప్రాతిపదికన బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. దేశంలో వీలైనంత త్వరగా జనాభా గణనను చేపట్టాలని, జనాభా గణన ఏళ్ల తరబడిగా జరగకపోవడంతో దేశంలోని దాదాపు 14 కోట్ల మంది ప్రజలు జాతీయ ఆహార భద్రత చట్టం ప్రయోజనాలను కోల్పోతున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగే జనాభా గణనలో బిసి కుల గణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు పెంచాలని ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. బిసిల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం బిసిలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి రూ. 50 వేల కోట్ల నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖలలో ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. కేంద్ర స్థాయిలో 2 లక్షల కోట్ల బడ్జెట్ బిసి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, పార్లమెంటులో బిసి బిల్లును ప్రవేశపెట్టి చట్ట సభల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని బిసి మహిళ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బర్ల మణి మంజరి సాగర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో బిసి మహిళ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మక్తాల శైలజా గౌడ్, శృతి గౌడ్, మహిళ సంక్షేమ సంఘం నాయకురాళ్ళు తారకేశ్వరీ, దీపాదేవి గౌడ్, శ్రీదేవి, గంగం జలజ, సుజాత, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

సిఐటియూ ఆధ్వర్యంలో ఘనంగా 139వ మేడే వేడుకలు

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్.

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి
