పద్మారావు నగర్లో అకాల వర్షం...అంతా అతాలకుతలం..
*సెల్లార్లలోకి వర్షపునీరు..మునిగిన బైకులు..
*చెరువుల్లాగా మారిన రోడ్లు
*ఇండ్లల్లోకి చేరిన వాన నీరు
*వెంకటాపురం కాలనీలో కూలిన ప్రహరీ
సికింద్రాబాద్ ఏప్రిల్ 03 (ప్రజామంటలు):
సిటీలో మద్యాహ్నం కురిసిన అకాల వర్షానికి అంతా అతలాకుతలం అయింది. ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. బన్సీలాల్ పేట డివిజన్ పద్మారావునగర్ వెంకటపురం కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న తుంగభద్ర మహిళా మండలి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఆరు నెలల క్రితం గుంతలు తవ్వి వదిలేశారు. పనులు ఇంకా మొదలు కాలేదు. గురువారం కురిసిన వానకు కాలనీకి చెందిన వరద నీరు మొత్తం ఈ కమ్యూనిటీ హాలు స్థలంలో నిండిపోయి , ప్రహరీ గోడ కుప్పకూలింది. దాంతో వరద నీరు పక్కనే ఉన్న ఇళ్లల్లోకి వెళ్లడంతో నిత్యవసర వస్తువులన్నీ పాడైపోయాయి. అన్ని గదుల్లో నీళ్లు వెళ్ళడంతో బకెట్లతో నీళ్లు బయట పారబోశారు. మున్సిపల్ అధికారులు సకాలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసి ఉంటే ఈరోజు తమకు ఈ దుస్థితి వచ్చేది కాదని వెంకటాపురం కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
పలు అపార్ట్ మెంట్ సెల్లార్ లోకి నీరు చేరడంతో బైకులు నీట మునిగాయి, పంపులు సాయంతో సెల్లార్ లోని వాన నీటిని బయటకు పంపింగ్ చేశారు. బౌద్దనగర్ డివిజన్ లో అకాల వర్షంతో పలు కాలనీలు నీట మునిగాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఎల్ ఎన్ ఆర్ నగర్ లో రోడ్లు నీట మునగగా, ఇండ్లల్లోకి నీరు వచ్చాయని స్థానికులు వాపోయారు. బన్సీలాల్ పేట సేవా సంఘం కమ్యూనిటీ హాల్ సమీపంలోని డీ క్లాస్ ప్రాంతంలో రోడ్లు జలమయం అయి, ఇండ్లల్లోకి నీరు చేరడంతో వస్తువులు నీట మునిగాయి. స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

సిఐటియూ ఆధ్వర్యంలో ఘనంగా 139వ మేడే వేడుకలు

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్.

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి
