సంఘటిత హిందూ సమాజం తోనే దేశాభివృద్ధి. ఆర్ఎస్ఎస్ జిల్లా బౌద్ధిక్ ప్రముఖ్ సాయి కృష్ణ.
జగిత్యాల సెప్టెంబర్ 25(ప్రజా మంటలు)
సంఘటిత హిందూ సమాజం తోనే దేశాభివృద్ధి జరుగుతుందని దీనికోసమే ఆర్ఎస్ఎస్ గత 100 సంవత్సరాలుగా కృషి చేస్తుందని ఆర్ఎస్ఎస్ జిల్లా బౌద్ధిక్ ప్రముఖ్ సాయి కృష్ణ అన్నారు.
ఆర్ఎస్ఎస్ విద్యానగర్ బస్తీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం 6 గంటలకు. విజయదశమి ఉత్సవాన్ని స్థానిక రామాలయం లో నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా ప్రముఖ నేత్ర వైద్యనిపుణులు డా.మృదుల వేణుగోపాల్ రెడ్డి హాజరవగా ప్రధాన వక్తగా సాయికృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1925 సంవత్సరం విజయదశమి రోజున నాగపూర్ లో
డా. హెడ్గేవార్ ఆర్ ఎస్ ఎస్ ను కేవలం కొద్దిమంది పిల్లలతో ప్రారంభించారన్నారు.
ఎన్నో ఇబ్బందులు, నిర్బంధాలను ఎదురించి ఈ వంద సంవత్సరాల కాలం లో సంఘం ఎన్నో విజయాలు సాధించిందని, సంఘటిత హిందూ సమాజం కోసం నిత్య శాఖ ద్వారా కృషి చేస్తుందని వివరించారు.
మన దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు విదేశీ శక్తులు ఎన్నో కుట్రలు పన్నుతున్నాయని,
దురదృష్టవశాత్తు మన దేశం లోని కొంతమంది వ్యక్తులు విదేశీ శక్తుల కు వత్తాసు పలుకుతున్నారని వారిపట్ల మనం అప్రమత్తంగా ఉండాలన్నారు.
దేశం పట్ల,సంస్కృతి పట్ల దేశప్రజల్లో భక్తి భావం పెంపొందించాలన్నారు.అతి విశిష్టమైన మన కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలని,అన్నికులాల మధ్య సామరస్య భావనను పెంపొందించుకోవాలని, పర్యావరణం ను పరిరక్షించుకోవాలని కోరారు.దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచేందుకు జీవితం లో స్వదేశీ భావనను పెంపొందించుకోవాలని, వ్యక్తిగతంగా,సామూహికంగా పౌర విధులను పాటించడం ద్వారా దేశం లో క్రమశిక్షణ పెరుగుతుందన్నారు.ప్రతి ఒక్కరూ నియమాలను పాటించాలని కోరారు.సమాజం కోసం ప్రతి ఒక్కరూ సమయం ఇవ్వాలని కోరారు.
విజయదశమి ఉత్సవం లో భాగంగా శస్త్ర పూజ నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ఆర్ఎస్ఎస్ నాయకులు శ్రీహరి,కొలిచాల రవీందర్,శంకర్, మధుకర్,రమేష్, మాజీ కౌన్సిలర్ ఏ సి ఎస్ రాజు,ఆర్వ లక్మి,పురుషోత్తం రావు, వెంకట్ రావు,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గొల్లపల్లిలో రెండు బైక్ లు డీ - ఇద్దరి మృతి

బిహార్ ఎన్నికల్లో 22మంది బాహుబలి అభ్యర్థులు – రాజకీయ వారసత్వమే ప్రధాన ఆయుధం
.jpg)
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు: ఆర్జేడీ 143 మంది అభ్యర్థుల జాబితా విడుదల – 24 మంది మహిళలు బరిలోకి
.jpeg)
బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ పట్ల కాంగ్రెస్ అసంతృప్తి

నిజామాబాద్ లో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్

ఉక్రెయిన్ పై రష్యా నిబంధనలను అంగీకరించమని ట్రంప్ ఒత్తిడి

మళ్లీ ఆర్థిక సడలింపు: కేంద్ర బ్యాంకులు అతిగా వదిలేస్తున్నాయా?
.jpeg)
చీకట్లు చీల్చి వెలుగులు విరజిమ్మే వేడుక దీపావళి పండుగ

ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య
