విధ్యుత్ సరఫరలో అంతరాయం రాకుండా ఉండేందుకు అదనపు బ్రేకర్ల ఎర్పాటు- ఎస్ ఈ సుదర్శనం
యామపుర్, వేములకుర్తి లో పిడర్లకు బ్రెకర్ల ప్రారంభించిన జగిత్యాల ఎన్పీడీసిఎల్ ఎస్ఈ సుదర్శనం
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 23 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
వినియోగదారులకు, రైతులకు నాణ్యమైన విద్యుత్ తోపాటు విధ్యుత్ సరఫరలో అంతరాయం రాకుండా ఉండేందుకు అదనపు బ్రేకర్ల ఎర్పాటుచేసినట్లు, జగిత్యాల ఎన్పీడీసిఎల్ ఎస్ఈ సుదర్శనం అన్నారు.
మంగళవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం లోని యామపుర్,వేములకుర్తి గ్రామలలోని 33/11 కేవి సబిస్టెషన్ లలో పిడర్ల కు బ్రెకర్ లను స్దానిక అదికారులు,సిబ్బంది తో కలిసి ప్రారంభం చేశారు. ఈసందర్భంగా ఎస్ ఈ సుదర్శనం మాట్లాడుతూ సబిస్టెషన్ లలో రూ.20 లక్షలతో రెండుబ్రెకర్లను ఏర్పాటు చేసి వినియోగదారులకు మరింత నాణ్యమైన విధ్యుత్ ను అందిస్తున్నమన్నారు.అన్ని సబ్స్టేషన్ లకు రెండవ ప్రత్యామ్నాయ 33కేవీ అంతర్గత లైన్లు నిర్మాణం చేస్తున్నామని అందులో దాదాపు 70 శాతం పూర్తి చేశామని తెలిపారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం అత్యంత తక్కువ సమయంలో రెండవ లైన్ నుండి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపారు. రైతులు మోటారు పంపుసెట్లకు కెపాసిటర్ లు బిగించుకొని ఓవర్ లోడ్, లో ఓల్టేజ్ సమస్యలు అధిగమించవచ్చని, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోకుండా రక్షించుకోవచ్చని, అందుకు రైతులు సహకారం అందించాలని కోరారు. రైతులకు లోడు భారం ఉంటే సిబ్బందిని ఆశ్రయిస్తే మరో ట్రాన్స్ఫార్మర్ మంజురు చేయిస్తామన్నారు.అనతరం ఉన్నత అదికారులను విధ్యుత్ సిబ్బంది శాలువలతో సన్మాణించారు. ఈకార్యక్రమంలో మెట్ పల్లి డివిజన్ డిఈ మధుసూదన్,డిఈ ఎంఆర్ టి రవింధర్ ,ఎడి ఎస్పి యం అనిల్ కుమార్, ఇంచార్జి ఎడిఈ అమరెంధర్,ఇబ్రహీంపట్నం ఎఇ సతిష్, సబ్ ఇంజనీర్, రాజేశ్, ఎస్ ఎల్ ఐ పుల్లురి సాంబముర్తి,లైన్ మైన్ కోలిపాక రాజు, తంగళ్ళ పెళ్ళి శ్యామ్ ,అపరేటర్ శ్రీధర్, శ్రీకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బాలపెల్లి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దరఖాస్తు దాఖలు

OTT లో విడుదలైన "కిష్కిందపురి"

బ్యాంకింగ్ ఒడిదుడుకుల నడుమ US స్టాక్‌లు కోలుకొంటున్నాయి

కవిత అక్కకు బీసీలు ఇప్పుడు గుర్తొచ్చారా? - బీజేపీ రాష్ట్ర నాయకురాలు ఎం. రాజేశ్వరి.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి పై దాడిచేసిన నిందితుడిని శిక్షించాలి

బీసీ బంద్ శాంతియుతంగా జరుపుకోండి - డీజీపీ శివథర్ రెడ్డి సూచన

ఛత్తీస్‌ఘడ్‌లో 210 మంది నక్సల్స్ లొంగిపోవడం — రాజ్యాంగ ప్రతిని పట్టుకొని “హింసకు గుడ్‌బై” చెప్పారు

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం

శ్రీ అభయాంజనేయ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట - పాల్గొన్న -మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్

జస్టిస్ ఫర్ బీసీస్" బంద్ — నిజంగా న్యాయమా, లేక కొత్త రాజకీయ యజ్ఞమా?
.jpg)
బీసీ బంద్ ను విజయవంతం చేద్దాం.-టీ భీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హరి అశోక్ కుమార్.

బీసీల బందుకు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు
