సంఘటిత హిందూ సమాజం తోనే దేశాభివృద్ధి. ఆర్ఎస్ఎస్ జిల్లా బౌద్ధిక్ ప్రముఖ్ సాయి కృష్ణ.

On
సంఘటిత హిందూ సమాజం తోనే దేశాభివృద్ధి.  ఆర్ఎస్ఎస్ జిల్లా బౌద్ధిక్ ప్రముఖ్ సాయి కృష్ణ.

 

జగిత్యాల సెప్టెంబర్ 25(ప్రజా మంటలు)

 సంఘటిత హిందూ సమాజం తోనే దేశాభివృద్ధి జరుగుతుందని దీనికోసమే ఆర్ఎస్ఎస్ గత 100 సంవత్సరాలుగా కృషి చేస్తుందని ఆర్ఎస్ఎస్ జిల్లా బౌద్ధిక్ ప్రముఖ్ సాయి కృష్ణ అన్నారు.

ఆర్ఎస్ఎస్ విద్యానగర్ బస్తీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం 6 గంటలకు. విజయదశమి ఉత్సవాన్ని స్థానిక రామాలయం లో నిర్వహించారు.

ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా ప్రముఖ నేత్ర వైద్యనిపుణులు డా.మృదుల వేణుగోపాల్ రెడ్డి హాజరవగా ప్రధాన వక్తగా సాయికృష్ణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1925 సంవత్సరం విజయదశమి రోజున నాగపూర్ లో
డా. హెడ్గేవార్  ఆర్ ఎస్ ఎస్ ను కేవలం కొద్దిమంది పిల్లలతో ప్రారంభించారన్నారు.

ఎన్నో ఇబ్బందులు, నిర్బంధాలను ఎదురించి ఈ వంద సంవత్సరాల కాలం లో సంఘం ఎన్నో విజయాలు సాధించిందని, సంఘటిత హిందూ సమాజం కోసం నిత్య శాఖ ద్వారా కృషి చేస్తుందని వివరించారు.

మన దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు విదేశీ శక్తులు ఎన్నో కుట్రలు పన్నుతున్నాయని,
దురదృష్టవశాత్తు మన దేశం లోని కొంతమంది వ్యక్తులు విదేశీ శక్తుల కు వత్తాసు పలుకుతున్నారని వారిపట్ల మనం అప్రమత్తంగా ఉండాలన్నారు.

దేశం పట్ల,సంస్కృతి పట్ల దేశప్రజల్లో భక్తి భావం పెంపొందించాలన్నారు.అతి విశిష్టమైన మన కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలని,అన్నికులాల మధ్య సామరస్య భావనను పెంపొందించుకోవాలని, పర్యావరణం ను పరిరక్షించుకోవాలని కోరారు.దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచేందుకు జీవితం లో  స్వదేశీ భావనను పెంపొందించుకోవాలని,  వ్యక్తిగతంగా,సామూహికంగా పౌర విధులను పాటించడం ద్వారా దేశం లో క్రమశిక్షణ పెరుగుతుందన్నారు.ప్రతి ఒక్కరూ నియమాలను పాటించాలని కోరారు.సమాజం కోసం ప్రతి ఒక్కరూ సమయం ఇవ్వాలని కోరారు.

విజయదశమి ఉత్సవం లో భాగంగా శస్త్ర పూజ నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ఆర్ఎస్ఎస్ నాయకులు శ్రీహరి,కొలిచాల రవీందర్,శంకర్, మధుకర్,రమేష్, మాజీ కౌన్సిలర్ ఏ సి ఎస్ రాజు,ఆర్వ లక్మి,పురుషోత్తం రావు, వెంకట్ రావు,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

National  International  

చైనాపై మళ్లీ ట్రంప్ దాడి – 155% టారిఫ్‌తో వాణిజ్య ఉద్రిక్తతలు

చైనాపై మళ్లీ ట్రంప్ దాడి – 155% టారిఫ్‌తో వాణిజ్య ఉద్రిక్తతలు వాషింగ్టన్ అక్టోబర్ 21: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాపై కఠిన వైఖరి ఎత్తుకున్నారు. అమెరికా ప్రయోజనాలను రక్షించేందుకు చైనా దిగుమతులపై 155 శాతం టారిఫ్ (దిగుమతి సుంకం) విధిస్తామని ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయం గ్లోబల్ మార్కెట్లలో కొత్త ఆర్థిక ఉద్రిక్తతలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ తన ప్రసంగంలో, “చైనా అమెరికాను...
Read More...

మునుగోడు లో మద్యం పాలసీపై కలకలం – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రేవంత్ సర్కార్ బిగ్ షాక్

మునుగోడు లో మద్యం పాలసీపై కలకలం – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రేవంత్ సర్కార్ బిగ్ షాక్ హైదరాబాద్ అక్టోబర్ 21 (ప్రజా మంటలు): మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో మద్యం విక్రయాలపై కొత్త నిబంధనలు ప్రవేశపెట్టడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గ్రామాల్లో మద్యం దుకాణాల అనియంత్రిత కార్యకలాపాలను అరికట్టేందుకు ఆయన తీసుకున్న నిర్ణయాలు మద్యం వ్యాపారులను కంగారు పెట్టాయి. రాజగోపాల్ రెడ్డి తాజాగా ప్రకటించిన నిబంధనల ప్రకారం —...
Read More...
Filmi News  State News 

రేణు దేశాయ్ మళ్లీ సినీ రంగ ప్రవేశం – కామెడీ సినిమాలో కీలక పాత్ర

రేణు దేశాయ్ మళ్లీ సినీ రంగ ప్రవేశం – కామెడీ సినిమాలో కీలక పాత్ర హైదరాబాద్ అక్టోబర్ 21: పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "బాద్రి" సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె, తర్వాత కాలంలో పవన్‌తో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ విడిపోయిన...
Read More...
State News 

వామపక్ష తీవ్రవాదులు జనజీవన స్రవంతిలో కలవండి - సీఎం రేవంత్ రెడ్డి

వామపక్ష తీవ్రవాదులు జనజీవన స్రవంతిలో కలవండి - సీఎం రేవంత్ రెడ్డి “పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా అన్ని ముఖ్య సంస్థలకు మహిళల సారధ్యం కానిస్టేబుల్ ప్రమోద్ కు ₹ కోటి పరిహారం,భార్యకు ఉద్యోగం విధినిర్వహణలో అమరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు  హైదరాబాద్ అక్టోబర్ 21 (ప్రజా మంటలు): వామపక్ష తీవ్రవాద భావజాల ఉద్యమాల్లో ఉన్న అజ్ఞాత నాయకులు జన జీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో...
Read More...
Local News 

జగిత్యాలలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు

జగిత్యాలలో  పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు జగిత్యాల అక్టోబర్ 21 (ప్రజా మంటలు): జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా ఘనంగా, పోలీసుల ఫ్లాగ్ డే నిర్వహించారు.   జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ , ఇతర పోలీసు అధికారులు,ఈ సందర్భంగా అమరులైన పోలీసులకు ఘన నివాళి అర్పించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ శాంతిభద్రతల...
Read More...
Local News  Crime 

గొల్లపల్లిలో రెండు బైక్ లు డీ - ఇద్దరి మృతి

గొల్లపల్లిలో రెండు బైక్ లు డీ - ఇద్దరి మృతి గొల్లపల్లి అక్టోబర్ 20 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాలో పండగ రోజున విషాదం గొల్లపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి చెందగా,ఒకరికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. గొల్లపల్లి మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ద్విచక్రవాహనదారులు ఇద్దరు...
Read More...
National  Comment  State News 

బిహార్ ఎన్నికల్లో 22మంది బాహుబలి అభ్యర్థులు – రాజకీయ వారసత్వమే ప్రధాన ఆయుధం

బిహార్ ఎన్నికల్లో 22మంది బాహుబలి అభ్యర్థులు – రాజకీయ వారసత్వమే ప్రధాన ఆయుధం గత శాసనసభలో 66% సభ్యులు నేర చరిత్ర ఉన్నవారే? పాట్నా, అక్టోబర్ 20 :బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఈసారి కూడా గ్యాంగ్‌స్టర్‌–రాజకీయ నాయకుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వివిధ పార్టీలు కలిపి మొత్తం 22 మంది బాహుబలి అభ్యర్థులు బరిలో ఉన్నారని పత్రికా నివేదికలు వెల్లడించాయి. వీరిలో కొందరు ప్రత్యక్షంగా క్రైమ్ కేసుల్లో నిందితులు...
Read More...
National  State News 

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు: ఆర్జేడీ 143 మంది అభ్యర్థుల జాబితా విడుదల – 24 మంది మహిళలు బరిలోకి

 బిహార్ అసెంబ్లీ ఎన్నికలు: ఆర్జేడీ 143 మంది అభ్యర్థుల జాబితా విడుదల – 24 మంది మహిళలు బరిలోకి 24 మంది మహిళలు, 16 మంది ముస్లింలు పాట్నా, అక్టోబర్ 20 :బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) సోమవారం మొత్తం 143 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. వీరిలో 24 మంది మహిళలు, 16 మంది ముస్లింలు ఉన్నారు. ఈ జాబితా రెండో,...
Read More...
Local News 

బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ పట్ల కాంగ్రెస్ అసంతృప్తి

బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ పట్ల కాంగ్రెస్ అసంతృప్తి ధర్మపురి అక్టోబర్ 20 (ప్రజా మంటలు):   బీర్పూర్ మండలం లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నూతన కమిటీ నియామకం పైన ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు అఫిస్ లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిసి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి,  బీర్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ అసంతృప్తిని దశాబ్దాల...
Read More...
Crime  State News 

నిజామాబాద్ లో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్

నిజామాబాద్ లో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ నిజామాబాద్ అక్టోబర్ 20 (ప్రజా మంటలు): నిజామాబాద్ లో పోలీసు కానిస్టేబుల్ ప్రమోద్ మృతికి కారణమైన నిందితుడు రియాజ్, ఆస్పత్రిలో జరిగిన కాల్పులలో మరణించినట్లు పోలీసులు తెలిపారు.  ఈనెలలో జరిగిన ఘటన నుండి తప్పించుకొని పారిపోయిన రియాజ్ ను నిన్న, సారంగాపూర్ దగ్గర పోలీసులు పట్టుకొన్నారు. ఈసందర్భంగా జరిగిన పెనుగులాటలో రియాజ్ కు గాయాలైనట్లు,అందుకే ప్రభుత్వ...
Read More...

ఉక్రెయిన్‌ పై రష్యా నిబంధనలను అంగీకరించమని ట్రంప్‌ ఒత్తిడి

ఉక్రెయిన్‌ పై రష్యా నిబంధనలను అంగీకరించమని ట్రంప్‌ ఒత్తిడి ట్రంప్-జెలెన్స్కీ విలేకరుల సమావేశంలోని 7 ముఖ్యాంశాలు వాషింగ్టన్‌ అక్టోబర్ 20:అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్‌ జెలెన్స్కీపై రష్యా ప్రతిపాదనలను అంగీకరించమని ఒత్తిడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్‌ అంగీకరించకపోతే “పుతిన్‌ దేశాన్ని నాశనం చేస్తాడు” అని ట్రంప్‌ బెదిరించినట్లు పత్రికలు ఆదివారం రాశాయి. సమాచారం ప్రకారం, గత శుక్రవారం...
Read More...
National  International  

మళ్లీ ఆర్థిక సడలింపు: కేంద్ర బ్యాంకులు అతిగా వదిలేస్తున్నాయా?

మళ్లీ ఆర్థిక సడలింపు: కేంద్ర బ్యాంకులు అతిగా వదిలేస్తున్నాయా? న్యూయార్క్ అక్టోబర్ 20: ప్రపంచ ఆర్థిక సంక్షోభాల మూలాలు చాలా సార్లు ఆర్థిక సడలింపుల దశల్లోనే విత్తనాల్లా నాటబడతాయి. చరిత్ర చూపినట్టుగా, వడ్డీ రేట్లు తక్కువగా ఉండి, సడలింపు ఆర్థిక విధానం కొనసాగిన తర్వాత వాటి కఠినతరం దశే పెద్ద సంక్షోభాలకు దారితీసిందను మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు....
Read More...