ఇన్నాళ్లు ప్రజలపై అధిక పన్నులు వేసిన బీజేపీ, ఇప్పుడు ఆ తప్పు దిద్దుకోవడాన్ని స్వాగతిస్తున్న - జీవన్ రెడ్డి
పన్నుల్లో రాష్ట్రాలకు 60% కేంద్రానికి 40% పన్నులు కేటాయించాలి.
జగిత్యాల సెప్టెంబర్ 25 (ప్రజా మంటలు):
కేంద్ర ప్రభుత్వం జీ ఎస్టీ పన్నులు ఇప్పుడు తగ్గించామని చెప్తున్నారు అంటే గతంలో అధిక పన్నుల భారం వేశామని చెప్పకనే చెప్తోందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు.
వినియోగదారులు ఎనిమిదేళ్లుగా ఆర్థిక భారం మోస్తున్నారు. జీ ఎస్ టి స్లాబులు 5,18, 40 స్లాబులు గా ఏర్పాటు చేయడం పై ఆహ్వానిస్తున్నాం.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మంగళ వారం మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈసమావేశంలో జీవన్ రెడ్డి పలు అంశాలు వివరించారు.
యూపీ ఏ ప్రభుత్వం పన్నుల విధానం సరళీకృతం చేయాలని, వినియోగదారుల పై పన్ను భారం తగ్గించాలనే లక్యం పన్నుల విధానం రూపొందించారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైన జీ ఎస్ టి పన్నుల విధానం పై వాస్తవాలను గ్రహించడం సంతోషకరం.ప్రతి వస్తువు పై గతంలో ఎంత రేటు ఉండే ఎంత తగ్గించారని వంటి వివరాలతో దుకాణం ఎదుట బోర్డు ఏర్పాటు చేయాలి.
ఓల్డ్ స్టాక్ పేరిట పాత పన్ను విధానం తో వినియోగదారుడి పై భారం మోపుతుండడం సరికాదు.జీ ఎస్ టి పన్నుల విధానం పై జిల్లా పరిపాలన అధికార యంత్రాంగం పర్యవేక్షించాలి.
జీ ఎస్టీ తగ్గింపు ఫలాలు వినియోగదారులకు చేరాలి.
నూతన జీ ఎస్టీ అమలుతో ఆదాయం కోల్పోతున్న రాష్ట్రాలకు కేంద్రం ఆదాయం సమకూర్చాలి.రాష్ట్రాలకు పన్నుల్లో రాష్ట్రాలకు 60 % వాటా కేటాయించాలి.పెట్రోల్, డీజిల్ పన్నులతో ప్రతి వస్తువు పై భారం పడుతుంది.
పొగాకు, మాదక ద్రవ్యాల పై 40 శాతం స్లాబులో చేర్చడం పై ఎవరికి భిన్నాభిప్రాయం లేదు.కేంద్రం, రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ పై విధిస్తున్న పన్నులు 50 శాతం దాటుతున్నాయి.
పొగాకు, మాదకద్రవ్యాల పై విధించే జీ ఎస్టీ పన్ను కన్నా పెట్రోల్, డీజిల్ పై విధిస్తున్న పన్నులు అధికం గా ఉన్నాయి. కేంద్రం, రాష్ట్రాలు వినియోగదారుల సంక్షేమాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలి.
పెట్రోల్, డీజిల్ లగ్జరీ వస్తువులు కాదు..నిత్యావసర వస్తువుల ధరలు కూడా, పెట్రోల్, డీజిల్ ధరల పై ఆధారపడి ఉన్నాయి.
18 శాతానికి తగ్గించడం సంతోషం.
పన్నుల్లో రాష్ట్రాలకు 60% కేంద్రానికి 40% పన్నులు కేటాయించాలి.వినియోగదారుల పై పన్నుల భారం తగ్గించాలనే ఆలోచననే పెద్ద సంక్షేమ పథకం.
క్షేత్ర స్థాయిలో ప్రజాభిప్రాయం మేరకు ప్రధాని మోడీ చొరవ తీసుకొని, పెట్రోల్, డీజిల్ పై ఒకే దేశం ఒకే పన్ను విధానం అమలు చేయాలి.
వినియోగదారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్రోల్, డీజిల్ 18 శాతం జీ ఎస్టీ స్లాబ్ లో చేర్చాలి.
జీ ఎస్టీ అమలుతో రాష్ట్రాలు తమ ఆదాయం కోల్పోతున్నామనే భావన లేకుండా కేంద్ర పన్నుల వాటాలో 60% రాష్ట్రాలకు కేటాయించాలి.
రాష్ట్రాలు స్వయం సంవృద్ధి సాధించే దిశగా కేంద్రం చొరవ తీసుకోవాలి.జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ప్రతి వ్యాపార సంస్థ ఎదుట నూతన పన్ను విధానం ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలి.
పాత పన్నులు..రెట్లు, జీ ఎస్టీ రేట్ల అమలు వినియోగదారుడికి తెలిసేలా బోర్డు ఏర్పాటు చేయాలి.. జీ ఎస్టీ పన్నుల విధానం లబ్ది వినియోగదారులకు చేరేలా పర్యవేక్షించాలని మాజీ మంత్రి తాటి పర్తి జీవన్ రెడ్డి జీల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
చీకట్లు చీల్చి వెలుగులు విరజిమ్మే వేడుక దీపావళి పండుగ

ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య

సోను, సతీష్ ల పార్టీ నుండి బహిష్కరణ

ఇజ్రాయెల్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన — 47 సార్లు దాడులు, 38 మంది పాలస్తీనియన్లు మృతి

రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర - సీఎం రేవంత్ రెడ్డి

టపాకులు రాత్రి 8 నుంచి 10 మధ్యనే కాల్చాలి - తిరుమలగిరి ఇన్స్పెక్టర్. జి నాగరాజు

దీపావళి జీవితాల్లో వెలుగు నింపాలి - అజాగ్రత్తతో జీవితాన్ని ఆగం చేసుకోకండి

పేద నిందితులకు బెయిల్ మొత్తాన్ని DLSA చెల్లించచ్చు - సుప్రీంకోర్టు

అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ పెట్టుబడి భారత్‌లోనే — సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం రాబోతోంది - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
.jpeg)