జస్టిస్ ఫర్ బీసీస్" బంద్ — నిజంగా న్యాయమా, లేక కొత్త రాజకీయ యజ్ఞమా?
హైదరాబాదు, అక్టోబర్ 17:
ఈరోజు తెలంగాణలో "జస్టిస్ ఫర్ బీసీస్" అంటూ బంద్ పెట్టారట. వినడానికి గొప్పగా ఉంది, కానీ లోపల చూశారంటే — బీసీ అభివృద్ధి పేరుతో మళ్లీ రాజకీయ బల్లెంలు, మైక్‌లు మాత్రమే మోగాయి.
చరిత్రలో ఎన్నిసార్లు "బీసీలకు న్యాయం" అనే పాట విన్నామో లెక్కలేదు. కానీ ప్రతిసారి లాభం ఎవరికి అంటే — ఓట్లు కోసం వేటాడే పార్టీలకే. బంద్ రోజు రోడ్లపై బోర్డులు, మైక్‌లు, ముద్దు స్లోగన్లు... కానీ బీసీ స్టూడెంట్‌కి స్కాలర్‌షిప్ రాదే, బీసీ రైతుకి ఎరువులు అందవే.
"బీసీలకు న్యాయం చేయాలి" అంటున్న నాయకులు చాలామంది — నామినేషన్ల టైమ్ తప్ప, బీసీల గేట్ దాటరు. వారికే మళ్లీ లాభం: బంద్ కవరేజీ వస్తుంది, ఫోటోలు పేపర్ల్లో వస్తాయి, ట్రెండింగ్‌లో పేర్లు తిరుగుతాయి. అంతే కదా రాజకీయ జస్టిస్.
ఆ బీసీ వాడు మాత్రం — స్కూల్ ఫీజు, బిజినెస్ లోన్, జాబ్ అవకాశాల కోసం ఇంతకీ ఎదురు చూస్తూనే ఉన్నాడు. బంద్ రోజు పని ఆగిపోతుంది, ఆటో డ్రైవర్‌కి రోజుకి వచ్చే 500 కూడా పోతుంది. అదే బీసీ వాడు — అదే నష్టం.
అసలే “జస్టిస్ ఫర్ బీసీస్” అన్న నినాదం కంటే “జస్టిస్ ఫర్ పొలిటికల్ బీసీస్” అనే పేరే సరిపోతుందేమో! ఎందుకంటే ఈ యజ్ఞాల్లో బీసీ పేరు వాడేది, లాభం పొందేది మాత్రం రాజకీయ బాబూలే!
బీసీలకు న్యాయం కావాలంటే బంద్‌లతో కాదు — నిజమైన పాలసీతో రావాలి.
అప్పుడే న్యాయం గట్టిగా మాట్లాడుతుంది, మైక్‌ల మీద కాకుండా మనసుల మీద!
More News...
<%- node_title %>
<%- node_title %>
జస్టిస్ ఫర్ బీసీస్" బంద్ — నిజంగా న్యాయమా, లేక కొత్త రాజకీయ యజ్ఞమా?
.jpg)
బీసీ బంద్ ను విజయవంతం చేద్దాం.-టీ భీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హరి అశోక్ కుమార్.

బీసీల బందుకు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు

హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థి శ్రీకాంత్ అనుమానస్పద మృతి

కరీఫ్ వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రణాళికలు సిద్ధం చేయాలి _రైస్ మిల్లర్ల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

హర్యానా కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ కు నివాళులు అర్పించిన మాజీ కౌన్సిలర్ భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసిఎస్ రాజు "

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం_ఏఐసిసి పరిశీలకుడు డాక్టర్ నరేష్ కుమార్, టిపిసిసి ఆర్గనైజర్ అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి

వాల్మీకి ఆవాసంలో జిల్లాస్థాయి గోవిజ్ఞాన పరీక్షలు

పెన్షనర్ల బకాయిలు చెల్లింపునకు రాజీలేని పోరాటం.-టీ పెన్షనర్ల రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్

అధికారుల అలసత్వం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుంది -జీవన్ రెడ్డి

సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కోట నీలిమ
