కవిత అక్కకు బీసీలు ఇప్పుడు గుర్తొచ్చారా? - బీజేపీ రాష్ట్ర నాయకురాలు ఎం. రాజేశ్వరి.
సికింద్రాబాద్, అక్టోబర్ 17 (ప్రజామంటలు):
తెలంగాణలో 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు బీసీలకు కేటాయిస్తూ, బిజెపిని గెలిపిస్తే బీసీ అభ్యర్థియే ముఖ్యమంత్రి అని బిజెపి జాతీయ నాయకత్వం ప్రకటించిన సందర్భంలో ఏలాంటి మద్దతు చేయని బిఆర్ఎస్ పార్టీకి చెందిన కవితకు బిజెపిని విమర్శించే నైతిక హక్కు లేదని బిజెపి రాష్ట్ర రజక సెల్ కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి విమర్శించారు.
ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... 2023 ఎన్నికల్లో బిజెపి గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని బిజెపి జాతీయ నాయకత్వం ప్రకటిస్తే ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు.బిఅరెస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ఎంతమంది బీసీలను మంత్రులను చేశారని అధికారం కోల్పోగానే కవితకు బీసీలు ఇప్పుడు గుర్తుకు వచ్చారా అని అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు అనడానికి కవిత వ్యాఖ్యలే నిదర్శనం అని అన్నారు. కవిత కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శలు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎందుకంటే గతంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు కలిసి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి అధికారాన్ని పంచుకున్న భావసారూప్యత కలిగిన పార్టీలని తెలంగాణ ప్రజలు మర్చిపోలేదని కవిత అర్థం చేసుకోవాలని అన్నారు. కేవలం అధికారం కోసం ఇలాంటి ప్రకటన చేస్తే తెలంగాణ చరిత్ర తిరగరాస్తామని రోడ్డుపై కవితను తిరగకుండా చేస్తామని హెచ్చరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బాలపెల్లి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దరఖాస్తు దాఖలు

OTT లో విడుదలైన "కిష్కిందపురి"

బ్యాంకింగ్ ఒడిదుడుకుల నడుమ US స్టాక్‌లు కోలుకొంటున్నాయి

కవిత అక్కకు బీసీలు ఇప్పుడు గుర్తొచ్చారా? - బీజేపీ రాష్ట్ర నాయకురాలు ఎం. రాజేశ్వరి.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి పై దాడిచేసిన నిందితుడిని శిక్షించాలి

బీసీ బంద్ శాంతియుతంగా జరుపుకోండి - డీజీపీ శివథర్ రెడ్డి సూచన

ఛత్తీస్‌ఘడ్‌లో 210 మంది నక్సల్స్ లొంగిపోవడం — రాజ్యాంగ ప్రతిని పట్టుకొని “హింసకు గుడ్‌బై” చెప్పారు

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం

శ్రీ అభయాంజనేయ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట - పాల్గొన్న -మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్

జస్టిస్ ఫర్ బీసీస్" బంద్ — నిజంగా న్యాయమా, లేక కొత్త రాజకీయ యజ్ఞమా?
.jpg)
బీసీ బంద్ ను విజయవంతం చేద్దాం.-టీ భీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హరి అశోక్ కుమార్.

బీసీల బందుకు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు
