మోకాలి శస్త్రచికిత్స తర్వాత జాతీయ క్రీడల్లో రజత పతకం

On
మోకాలి శస్త్రచికిత్స తర్వాత జాతీయ క్రీడల్లో రజత పతకం


-సెపక్‌తక్రా క్రీడాకారిణి నవత విజయగాథ
- శిక్షణలో ఉండగా పూర్తిగా దెబ్బతిన్న ఏసీఎల్
- సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స, ఫిజియోథెరపీ
- కోలుకుని క్రీడల్లో తిరిగి మెరిసిన యువతి

సికింద్రాబాద్, సెప్టెంబర్ 23 (ప్రజామంటలు) :

చిన్ననాటి నుంచే సెపక్‌తక్రా ఆటగాళ్లలో ఒకరుగా ఎదిగారు నవత. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమవుతున్న ఆమె, 2024 ఆసియా క్రీడల్లో పాల్గొనాలనే లక్ష్యంతో గోవాలో శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. అయితే, శిక్షణ సమయంలో మోకాలికి తీవ్ర గాయం ఏర్పడింది. ఆ గాయాన్ని అధిగమించి, మళ్లీ తిరిగి బరిలోకి దిగి ఈసారి జాతీయ స్థాయిలో రజత పతకాన్ని గెలుచుకున్నారు.

ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ఆర్థ్రోస్కోపి, జాయింట్ రీప్లేస్‌మెంట్ మరియు స్పోర్ట్స్ సర్జన్ డాక్టర్ హరిప్రకాష్ ఆమె చికిత్స గురించి వివరించారు. 

నవతకు శిక్షణలో ఉండగా మోకాలికి తీవ్ర గాయం:

నవత శిక్షణలో ఉండగా మోకాలికి తీవ్రమైన గాయం అయ్యింది. నొప్పి ఎక్కువగా ఉండటంతో, ఇంటర్నెట్‌లో అన్వేషించి మమ్మల్ని సంప్రదించారు. పరీక్షల తర్వాత ఆమెకి ఉన్న గాయం – పూర్తిగా నాశనమైన ఏసీఎల్ (యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్) అని నిర్ధారించాం. ఇది మోకాలిలో ప్రధాన లిగమెంట్‌లలో ఒకటి. గాయం తీవ్రంగా ఉండటంతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. మొదట వాపు తగ్గేందుకు రెండు వారాల పాటు వేచి ఉన్నాం. అనంతరం ఆమె తన మోకాలిలో ఉండే మరో లిగమెంట్‌ను తీసుకుని మళ్లీ అమర్చాం. ఫిజియోథెరపీ తర్వాత ఆమె పూర్తిగా కోలుకుని తిరిగి ఆటను ప్రారంభించారు. అంతకుమించి, జాతీయ స్థాయిలో పతకం సాధించడం ఆనందదాయకం.

ట్రీట్మెంట్ ఇలా.....

 తొడ నుండి లిగమెంట్ తీసుకుంటే శరీరానికి ఎలాంటి హాని ఉండదు. పైగా శరీరం త్వరగా అంగీకరిస్తుంది. కృత్రిమ లిగమెంట్లను ఉపయోగిస్తే అంగీకారం కొంత ఆలస్యం అవుతుంది. ఒకటి కంటే ఎక్కువ లిగమెంట్లు దెబ్బతినినప్పుడు మాత్రమే కృత్రిమ లిగమెంట్లు ఉపయోగిస్తాం. గాయాలు వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. అప్పుడు ఏసీఎల్ మాత్రమేనా, లేక మెనిస్కస్ గానీ, కార్టిలేజ్ గానీ దెబ్బతిన్నాయా అన్నది తెలుసుకోవచ్చు. లిగమెంట్ గాయాలు అయితే వాపు తగ్గిన తర్వాతే శస్త్రచికిత్స చేస్తాం. శస్త్రచికిత్స తర్వాత ఫిజియోథెరపీ కూడా ఎంతో కీలకమని డాక్టర్ హరిప్రకాష్ తెలిపారు.

తిరిగి ఆడగలనని అనుకోలేదు" – నవత

ఆసియా క్రీడలలో ఆడే అవకాశానికి చాలా ఉత్సాహంగా గోవాలో శిక్షణలో పాల్గొన్నాను. కానీ అక్కడ మోకాలికి గాయం కావడంతో ఎంతో షాక్‌కి లోనయ్యాను. వెంటనే బెస్ట్ స్పోర్ట్స్ సర్జన్ ఎవరో ఇంటర్నెట్‌లో వెతికాను. అప్పుడే కిమ్స్ లో డాక్టర్ హరిప్రకాష్ పేరును చూశాను. మా సొంత ఊరు ఇక్కడే కావడంతో వెంటనే ఆస్పత్రికి వచ్చి చూపించుకొని శస్త్రచికిత్స చేయించుకున్నాను.ఆ తర్వాత ముంబైలో ఆదాయపన్ను శాఖలో ఉద్యోగం రావడంతో ఫిజియోథెరపీకి ఎక్కువ సెలవులు తీసుకోలేకపోయాను. అందువల్ల కోలుకోవడానికి సుమారు 8–10 నెలలు పట్టింది. తర్వాత నెమ్మదిగా తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టాను. 2024 అక్టోబర్, నవంబర్ నెలల నుంచి తిరిగి శిక్షణ కొనసాగించాను.

సెపక్‌తక్రా అనేది లెగ్ వాలీబాల్ లాంటి ఆట. చెయ్యి తాకితే ఫౌల్ అవుతుంది. మోకాళ్లతో ఎక్కువ పనివుంటుంది. అటువంటి ఆటను మోకాలి శస్త్రచికిత్స తర్వాత మళ్లీ ఆడగలనని నేను అనుకోలేదు. కానీ డాక్టర్ చేసిన శస్త్రచికిత్స విజయవంతంగా జరగడంతో నేను పూర్తిగా కోలుకుని జాతీయ స్థాయిలో పతకం సాధించగలిగాను అని నవత ఆనందం వ్యక్తపరిచారు

Tags
Join WhatsApp

More News...

Local News 

బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డ్

బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డ్ బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ట్రస్ట్ బోర్డ్ నూతన కార్యవర్గ సభ్యులుగా, మూడేళ్ల కాలం పాటు నియామకం అయిన ట్రస్ట్ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చన్ని అందజేసి నియామకానికి సహకరించిన సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా...
Read More...
Crime  State News 

నిజామాబాద్‌లో కానిస్టేబుల్ హత్య

నిజామాబాద్‌లో కానిస్టేబుల్ హత్య   బైక్ దొంగను తరలిస్తుండగా కానిస్టేబుల్‌పై దాడి చేయడంతో,కానిస్టేబుల్ ప్రమోద్‌ ఘాట్‌ గాయాలతో మృతి, నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌ అక్టోబర్ 19 (ప్రజా మంటలు):   వినాయక్‌ నగర్‌లో పోలీసు కానిస్టేబుల్‌ ప్రమోద్‌పై శుక్రవారం సూక్ష్మ కత్తితో దాడి జరిగింది. బైక్ దొంగతనాల్లో నిందితుడు రియాజ్‌ను అదుపులోకి తీసుకుని ,స్టేషన్‌కు తరలించే తీవ్ర...
Read More...
Local News 

దీపావళి సందర్భంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి - చిలకలగూడ ఏసీపీ శశాంక్‌ రెడ్డి 

దీపావళి సందర్భంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి  - చిలకలగూడ ఏసీపీ శశాంక్‌ రెడ్డి  సికింద్రాబాద్‌, అక్టోబర్‌ 19 (ప్రజామంటలు): దీపావళి పండుగ సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చిలకలగూడ డివిజన్‌ ఏసీపీ శశాంక్‌ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలకు పలు  సూచనలు చేశారు. చిన్న పిల్లలు క్రాకర్లు కాల్చేటప్పుడు తప్పనిసరిగా పెద్దలు దగ్గర ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు....
Read More...
Local News  International  

యూఎస్ లో అడ్వాన్స్ దీపావళి వేడుకలు 

యూఎస్ లో అడ్వాన్స్ దీపావళి వేడుకలు  సికింద్రాబాద్,  అక్టోబర్ 18 (ప్రజా మంటలు):   యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని జార్జియా రాష్ట్రం అట్లాంటలో శనివారం రాత్రి పలువురు ప్రవాస హైదరాబాదీలు  దీపావళి పండుగను ముందస్తుగా ఘనంగా జరుపుకున్నారు.  దీపావళి వేడుకలను పురస్కరించుకొని తమ ఇండ్ల ముందు వివిధ రకాల పూలతో అందమైన రంగవల్లికలు వేసి అందులో దీపాలు పెట్టి సాంప్రదాయ బద్ధంగా కాకర...
Read More...
Local News 

మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ 

మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్  ఇబ్రహీంపట్నం అక్టోబర్ 18 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండలంలో వ్యవసాయ మార్కెట్లోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని పర్యవేక్షించి.మొక్కజొన్న రైతుల కొనుగోలు సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుని, రైతులకు జిల్పలా కలెక్టర్ సత్య ప్రసాద్  సూచనలు చేశారు.ధరల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.రైతులు తేమ శాతం 14 శాతం ఉండేవిధంగా చూసుకోవాలని...
Read More...
Local News 

ఏఐసీసీ జిల్లా ఇన్చార్జ్ జయ కుమార్ ను కలిసిన  షేక్ చాంద్ పాషా 

ఏఐసీసీ జిల్లా ఇన్చార్జ్ జయ కుమార్ ను కలిసిన  షేక్ చాంద్ పాషా  జగిత్యాల, అక్టోబర్ 18 (ప్రజా మంటలు): టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ షేక్ చాంద్బాషా గారు జగిత్యాల జిల్లా అతిథి గృహములో ఏఐసీసీ జిల్లా ఇన్చార్జ్ జయ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం ఇచ్చి, కండువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా గల్ఫ్ బాధితుల సమస్యలను వివరించారు. గత 20 సంవత్సరాలుగా గల్ఫ్...
Read More...

జ్యోతి సురేఖ వెన్నం – భారతీయ ఆర్చరీలోతెలుగు గర్వం

జ్యోతి సురేఖ వెన్నం – భారతీయ ఆర్చరీలోతెలుగు గర్వం    హైదరాబాద్ అక్టోబర్ 17 (ప్రజా మంటలు): జ్యోతి సురేఖ వెన్నం (జననం: 3 జూలై 1996, చల్లపల్లి, కృష్ణ జిల్లా ఆంధ్రప్రదేశ్) భారతీయ క్రీడా ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆర్చర్. కాంపౌండ్ బోว์ విభాగంలో ఆమె అత్యంత ప్రతిభావంతురాలు. K L యూనివర్సిటీ నుండి బీటెక్ మరియు ఎంబిఎ పూర్తి చేసిన జ్యోతి, 2024...
Read More...

జ్యోతి సురేఖ వెన్నం చరిత్ర సృష్టించింది – వరల్డ్ కప్ ఫైనల్లో కాంస్య పతకం!

జ్యోతి సురేఖ వెన్నం చరిత్ర సృష్టించింది – వరల్డ్ కప్ ఫైనల్లో కాంస్య పతకం! జ్యోతి సురేఖ వెన్నం – తొలి భారత మహిళా కంపౌండ్ ఆర్చర్‌గా వరల్డ్ కప్ ఫైనల్ పతక విజేత అమెరికాలో జరిగిన ఫైనల్‌లో కాంస్య పతకం అంతర్జాతీయ స్థాయిలో మరో గర్వకారణమైన ఘనత హైదరాబాద్ అక్టోబర్ 18: భారతీయ ఆర్చరీలో కొత్త చరిత్ర రాసింది తెలుగు తేజం జ్యోతి సురేఖ వెన్నం. వరల్డ్ కప్...
Read More...
Local News 

జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జెడ్పి డిప్యూటీ సిఈవో పి.నరేష్

జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జెడ్పి డిప్యూటీ సిఈవో పి.నరేష్ జగిత్యాల అక్టోబర్ 18 (ప్రజా మంటలు)జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కలెక్టరేట్ లో గల జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల కార్యాలయంలో శనివారం రోజున పూర్తి అదనపు బాధ్యతలను స్వీకరించిన జెడ్పి డిప్యూటీ సిఈవో పల్లికొండ నరేష్
Read More...
Local News 

42 శాతం బీసీ బిల్లుకు టిపిసిసి లీగల్ సెల్ మద్దతు

42 శాతం బీసీ బిల్లుకు టిపిసిసి లీగల్ సెల్ మద్దతు జగిత్యాల అక్టోబర్ 18 ( ప్రజా మంటలు) తెలంగాణ వ్యాప్తంగాబీసీ రిజర్వేషన్ బిల్ మద్దతుగా 42% రిజర్వేషన్ బీసీ లకు కల్పించాలని చట్టసభలలో రాష్ట్రమంతట బీసీ రిజర్వేషన్ ఉండాలని ఏకగ్రీవ తీర్మానం అసెంబ్లీలో ఆమోదించిన రాజ్యాంగపర సమస్యలు ఉన్నాయని బిల్ లో సమస్యలు ఉన్నాయని రిజర్వేషన్ను తాత్కాలీకంగా గా నిలుపుదల చేసారు. అందుకు ఈ బిల్...
Read More...
Local News 

42 శాతం రిజర్వేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

42 శాతం రిజర్వేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల అక్టోబర్ 18 (ప్రజా మంటలు)42 శాతం రిజర్వేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు. శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.అసెంబ్లీ లోరెండు రోజుల పాటు చర్చ అనంతరం అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయన్నారు.గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్...
Read More...
Local News 

తెలంగాణ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జనరల్ మీటింగుకు ఎమ్మెల్యే డా సంజయ్ కు ఆహ్వానం అందజేత

తెలంగాణ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జనరల్ మీటింగుకు ఎమ్మెల్యే డా సంజయ్ కు ఆహ్వానం అందజేత    జగిత్యాల అక్టోబర్ 18 (ప్రజా మంటలు)జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే. సంజయ్ కుమార్ ని వారి నివాసంలో కలిసి  తేదీ : 26/10/2025 రోజున తెలంగాణ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జనరల్ మీటింగ్ కు రావాల్సిందిగా ఆహ్వానం అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శి లు మరియు వివిధ...
Read More...