పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
జగిత్యాల అక్టోబర్ 16 ( ప్రజా మంటలు)
బి.ఎల్.ఓ. లకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలి
ఓటర్ ఐడి కార్డుల పంపిణీ వెంటనే పూర్తి చేయాలి
ఓటరు జాబితా సంబంధించి పలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించిన సీఈఓ
పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అన్నారు.
జిల్లా కలెక్టర్లతో గురువారం రాష్ట్ర సీఈఓ సుదర్శన్ రెడ్డి, ఓటర్ జాబితా సంబంధించి పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్, జగిత్యాల మెట్ పెల్లి ఆర్డీవోలు మధుసూదన్, శ్రీనివాస్, శిక్షణ డిప్యుటీ కలెక్టర్ కన్నం హరిణి లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
బూత్ స్థాయి అధికారుల నియామకం, నూతన ఓటర్లకు ఓటర్ కార్డుల పంపిణీ వంటి పలు అంశాలపై కలెక్టర్ లకు సీఈఓ పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా *రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ
ఓటర్ జాబితా సంబంధించి పెండింగ్ దరఖాస్తులు ఎక్కడైనా ఉంటే కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఎన్నికల కమీషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పెండింగ్ ఫారం 6, 7, 8 దరఖాస్తులకు సంబంధించి, నోటీస్ పీరియడ్ జారీ చేసిన 7 రోజుల లోగా పరిష్కరించాలని అన్నారు. జిల్లాలో ప్రతి పోలింగ్ బూత్ కు బూత్ స్థాయి అధికారి (బి.ఎల్.ఓ.) నియామకం పూర్తి కావాలని, బిఎల్ఓ లకు ఐడి కార్డులు జారీ చేయాలని అన్నారు.
నూతన ఓటర్లకు ఓటర్ ఐడి కార్డుల పంపిణీ ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేయాలని అన్నారు.
వీసీ అనంతరం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులతో మాట్లాడుతూ
స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ 2002 లో పేరు నమోదు కాకుండా మిస్ అయిన ఓటర్లు జిల్లాలో ఎంతమంది ఉంటారో పరిశీలించి నివేదిక తయారు చేయాలని అన్నారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ క్యాటగిరి బి, సి, డి ఫీల్డ్ లెవల్ పరిశీలించి రికన్సైల్ చేసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో జగిత్యాల, మెట్ పెల్లి రెవెన్యూ డివిజన్ అధికారులు మధుసూదన్, శ్రీనివాస్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ కన్నం హరిణి తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కరీఫ్ వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రణాళికలు సిద్ధం చేయాలి _రైస్ మిల్లర్ల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

హర్యానా కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ కు నివాళులు అర్పించిన మాజీ కౌన్సిలర్ భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసిఎస్ రాజు "

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం_ఏఐసిసి పరిశీలకుడు డాక్టర్ నరేష్ కుమార్, టిపిసిసి ఆర్గనైజర్ అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి

వాల్మీకి ఆవాసంలో జిల్లాస్థాయి గోవిజ్ఞాన పరీక్షలు

పెన్షనర్ల బకాయిలు చెల్లింపునకు రాజీలేని పోరాటం.-టీ పెన్షనర్ల రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్

అధికారుల అలసత్వం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుంది -జీవన్ రెడ్డి

సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కోట నీలిమ

గాంధీలో ప్రపంచ అనస్థీషియా దినోత్సవం

ఐసీసీ అవార్డులు గెలుచుకున్న అభిషేక్ శర్మ, స్మృతి మంధాన!

చెక్ బౌన్స్ కేసులో గంటా రామ్మోహన్ కు 6 నెలల జైలుశిక్ష
.jpeg)
బిసి బంద్ ను విజయవంతం కొరకు ముందుకు రండి...
