పాత గొడవల నేపధ్యంలో హత్య, ఇద్దరికి జీవిత ఖైదు
ఒక్కొక్కరికి 7000/- రూపాయల జరిమాన
కీలక తీర్పును వెలువరించిన ఎడిజె నారాయణ
నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరు:జిల్లా ఎస్పి అశోక్ కుమార్
(అంకం భూమయ్య)
గొల్లపల్లి సెప్టెంబర్ 15 (ప్రజా మంటల):
వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎండపల్లి గ్రామానికి చెందిన అంకం మల్లేశం,రాజేశం లు మామ,అల్లుడు అదే గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణకు మధ్య పాత గొడవలు ఉండేవి. రాజేశం మరియు అతని అత్తమ్మ అయిన సరస్వతిని లక్ష్మీనారాయణ కొట్టగా లక్ష్మీనారాయణ పై కేసు నమోదు చేశారు. కేసును మనసులో పెట్టుకొని అంకం మల్లేశం వల్లే, కేసు నా పై నమోదు కావడం జరిగిందని తరచూ రాజేశం ను మరియు అతని మామ అయన మల్లేశంను లక్ష్మి నారాయణ తిట్టసాగారు.
తేదీ:20-09-2016 రోజున సాయంత్రం 6 గంటల సమయంలో మల్లేశం ను ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో లక్ష్మీనారాయణ అతని భార్య విజయ కారపొడి తీసుకొచ్చి మల్లేశం కళ్ళలో చల్లగా నారాయణ గొడ్డలితో మల్లేశం తలపై కొట్టగా, మల్లేశం కు తీవ్ర గాయాల కావడం జరిగింది. ఈ యొక్క గొడవను ఆపడానికి వెళ్లిన రాజేశం పైన కూడా నారాయణ దాడి చేయడం జరిగింది. తీవ్ర గాయాలైన మల్లేషo ను ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో చనిపోయాడు
మృతుడి కూతురు ఫిర్యాదు మేరకు, ఎస్సై వెంకటేశ్వర రావు నిందితుని పై కేసు నమోదు చేయగా ఇన్స్పెక్టర్ ఎడ్ల మహేష్ ఇన్వెస్టిగేషన్ చేసి చార్జీ షీట్ దాఖలు చేశారు.
నిందితులైన నారాయణ, విజయ లను కోర్టు లో హాజరుపరచగా సాక్షులను విచారించిన 1st Addl. District & Sessions Judge నారాయణ నిందితులకు జీవిత ఖైదు తో పాటు ఒక్కొక్కరికి 7000/- రూపాయలు జరిమానా విధిస్తూ ఈరోజు తీర్పును వెలువరించారు.
నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరు:జిల్లా ఎస్పి అశోక్ కుమార్
ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ ... సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించు కోలేరని పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు. పై కేస్ లో నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన అధికారులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్

గాంధీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పి.వై.ఎల్ నాయకులు

పాత గొడవల నేపధ్యంలో హత్య, ఇద్దరికి జీవిత ఖైదు
.jpeg)
గొల్లపల్లిలో సామూహిక శ్రీ విశ్వకర్మ వ్రతం

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే_ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

పాక్ జట్టుతో భారత జట్టు కరచాలనం చేయకపోవడంపై పాక్ నిరసన

వక్ఫ్ చట్టంపై స్టే నిరాకరణ - కొన్ని సెక్షన్ల నిలుపుదల - సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు

పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్
