ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి
చైర్మన్ గా ఎల్కతుర్తి మండలానికి చెందిన సుకినే సంతాజీ
హర్షం వ్యక్తం చేసిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు
భీమదేవరపల్లి, ఆగస్టు 30 ప్రజామంటలు :
వ్యవసాయ శాఖ శనివారం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఎల్కతుర్తి మండలానికి చెందిన సుకినే సంతాజి చైర్మన్‌గా ఎంపిక కాగా, భీమదేవరపల్లి మండలానికి చెందిన బొక్కల స్రవంతి వైస్ చైర్మన్‌గా ఎంపికయ్యారు. స్రవంతి కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా ఉంటూ, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్తఫాపూర్ - ముత్తారం ఎంపీటీసీగా సేవలు అందించారు. కాంగ్రెస్ అధికారంలో లేకున్న కాంగ్రెస్ లోనే కొనసాగుతూ, నిబద్ధత గల కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నారు. అలాగే కమిటీ సభ్యులుగా మండలంలోని ముల్కనూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు గనవేన కొమరయ్య, షేక్ హకీమ్ పాషా, మాలోత్ జగన్, కొత్తకొండ గ్రామానికి చెందిన జోడుమంతల వెంకటస్వామి నియమితులయ్యారు. వారి నియామకంపై మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తమ నియామకానికి సహకరించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి, వారికి సహాయపడే దిశగా నిష్పక్షపాతంగా పనిచేస్తామని కొత్తగా నియమితులైన చైర్మన్, వైస్ చైర్మన్ మరియు సభ్యులు స్పష్టం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత -పర్యావరణ పరిరక్షణకై మక్తాల దంపతులు

గాంధీ ఆసుపత్రిని 3 వేల పడకలకు అప్ గ్రేట్ చేయాలి

క్రమశిక్షణ, కఠోర శ్రమ తోనే ఉన్నత శిఖరాలకు - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

రికార్డు ప్రయాణంతో నెలలు నిండని శిశువును కాపాడిన కిమ్స్ కడల్స్ బృందం

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం - హరి అశోక్

చెన్నూరు SBI బ్యాంక్ లో బంగారం దోపిడీ కేసులో 44 మంది అరెస్ట్

జగిత్యాల విద్యానగర్ లో 11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్
1.jpeg)
రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి. జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.

మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి
