వేలంపాటలో రూ.18,500 లకు లడ్డు ను దక్కించుకున్న నానమ్మ
కృష్ణవేణి స్కూల్ లో ఘనంగా వినాయక నవరాత్రోత్సవాలు..
సికింద్రాబాద్, ఆగస్ట్ 30 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ భోలక్ పూర్ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ప్రతిష్టించిన వినాయక మండపంలో గణనాథుడి నవరాత్రోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. శనివారం గణనాథుడి లడ్డూ వేలం పాట కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్ విద్యార్థుల కుటుంబసభ్యులు లడ్డూ వేలంపాటలో పాల్గొన్నారు. విద్యార్థులు ఎస్.సాయిచరణ్,నవనీత్ కుమార్,ధనస్వి ల నానమ్మ రాజేశ్వరీ హెచ్చు పాట పాడి రూ 18,500 లకు గణనాథుడి లడ్డూను దక్కించుకున్నారు. ఎంతో ఉత్సాహంగా లడ్డూ వేలంపాటలో పాల్గొని, లంబోదరుడి లడ్డును దక్కించుకున్న రాజేశ్వరీని పలువురు అభినందించి, సన్మానించారు. తమ పిల్లలకు చక్కటి విద్యా బుద్దులు రావాలని తాను గణేశుడి లడ్డు కోసం వేలంపాటలో పాల్గొన్నట్లు తెలిపారు. పాఠశాలలో గత ముప్పయి ఏండ్లుగా వినాయక నవరాత్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు కరస్పాండెంట్ డాక్టర్ మంచాల శ్రీనివాసులు తెలిపారు.ఆదివారం వినాయక నిమజ్జనం ఉంటుందన్నారు. కార్యక్రమంలో స్కూల్ హెడ్ మిస్ర్టెస్ వరలక్ష్మీ మంచాల, టీచర్లు,సిబ్బంది, పేరేంట్స్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల పట్టణంలో విద్యానగర్ లో 11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్
1.jpeg)
రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి. జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.

మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి

దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్

ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ

దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి కుంకుమార్చన

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి
