పురాతన ఉన్నత పాఠశాలలో 79 వ స్వాతంత్ర్య దిన వేడుకలు - విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతి
జగిత్యాల ఆగస్ట్ 17 (ప్రజా మంటలు):
పురాతన ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ప్రభాత భేరి నిర్వహించి, పాఠశాలలో ఉదయం 8-30 ని. లకు ప్రధానోపాద్యురాలు చంద్రకళ పతాక ఆవిష్కరణ చేశారు. తదనంతరం జరిగిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆనందరావు, ఉపాధ్యాయ బృందం తో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
సమావేశంలో విద్యార్థులు వివిధ ప్రదర్శనల అనంతరం,. పూర్వవిద్యార్థులు సీనియర్ పాత్రికేయులు సిరిసిల్ల శ్రీనివాస్, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు గుండేటి గంగాధర్,పాల్గొని, జగిత్యాల వాస్తవ్యులు విశ్రాంత IFS అధికారి దాసరి నాగభూషణం వారి తల్లిదండ్రులు పేరిట ప్రతి సంవత్సరం ఇస్తున్న నగదు బహుమతులను, మేమేంటోస్, ప్రశంస పత్రాలు పదవ తరగతి లో ఉత్తమ స్థాయిలో నిలిచిన విద్యార్థులకు ప్రధానం చేసారు.
ఈ సమావేశంలో ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడి విద్యార్థుల క్షేమన్ని కాంక్షించారు. అలాగే శ్రీనివాస్, గంగాధర్ గార్లు మాట్లాడుతూ, దాసరి నాగభూషణం లాగా ఉన్నత పదవులు అధిష్టించి, తల్లీ దండ్రులను గౌరవించి వారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరినారు.
ఈ సందర్భంలో పాటశాలకు మంచినీటి సమస్య గురించి చంద్రకళ,రోటరీ క్లబ్ తరపున పాత్రికేయులు శ్రీనివాస్ ను సహకరించాలని కోరినారు.
ఇదే సందర్భంలో బాలే రాజయ్య అనే విద్యార్ధి పోషకుడు ఇందులో ఇద్దరు విద్యార్థులకు వెయ్యి రూపాయల చొప్పున ప్రోత్సాహక బహుమతి అందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
స్కందగిరి లో ఆది కృత్తిక పాల్గుడ ఉత్సవాలు

బేగంపేట లో వాజ్ పేయి వర్థంతి

యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు

ఇబ్రహీంపట్నం మండల వ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ధర్మపురి లక్ష్మీ నర్సింహా స్వామిని దర్శించుకున్న నిజమాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్త

ఈ నెల 19 - 20 తేదీలలో RSS అత్యవసర సమావేశం
.jpeg)
పురాతన ఉన్నత పాఠశాలలో 79 వ స్వాతంత్ర్య దిన వేడుకలు - విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతి

150 కోట్ల వసూలు చేసిన "రజనీకాంత్ - నాగార్జున" ల కికూలి:
.jpeg)
మలయాళ సినిమా తారల సంఘానికి మహిళా నాయకత్వం
.jpg)
79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జగిత్యాల బాస్కెట్బాల్ క్రీడాకారుల ఆనంద హేలా.

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా లలితా సహస్రనామ పారాయణం

అందరూ అనుకున్నట్లే ఎలాంటి ఒప్పందం లేకుండా ముగిసిన ట్రంప్ -పుతిన్ సమావేశం
1.jpeg)