గోదావరి నది నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ధర్మపురి ఆగస్టు 14 (ప్రజా మంటలు)
భారీ వర్షాలు దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ధర్మపురిలో గోదావరి నది ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ధర్మపురి గోదావరి ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నది వద్ద ప్రస్తుత నీటి మట్టం, ప్రవాహం వేగం, సేఫ్టీ బారికేడ్లు, రక్షణ చర్యలను పరిశీలించారు. భారీ వర్షాల వల్ల ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల నుండి నీటి ప్రవాహం కొనసాగుతున్న దృష్ట గోదావరి యొక్క నీటి ప్రవాహం ఉదృతంగా ఉంటుంది కావున గోదావరి నది యొక్క ప్రవాహాన్ని చూడడానికి, నదిలో దిగడం గాని నది వద్ద సెల్ఫీలు, ఫోటోలు తీసుకోవడం చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కావున నది వద్దకు వెళ్ళకూడదు అని ప్రజలకు సూచించారు.
ప్రజలు నీటి ఉధృతిని అంచనా వేయకుండా స్నానాలు చేయడానికి నది లోపలికి వెళ్లే ప్రయత్నం చేయవద్దన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఆలయ అధికారులు సిబ్బంది ఎల్లప్పుడూ అలర్ట్ గా ఉండాలని, వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని, ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షాల ప్రభావం, వరద పరిస్థితిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రజలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా చైతన్య పర్చాలని సూచించారు.
ఎస్పీ వెంట ధర్మపురి సి.ఐ రామ్ నరసింహారెడ్డి, ఎస్.ఐ ఉదయ్ కుమార్, ఆలయ చైర్మన్ రవీందర్, ఈవో శ్రీనివాస్, ఎమ్మార్వో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మరియు పోలీస్ సిబ్బంది ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పవర్ గ్రిడ్ ప్రధాన కార్యాలయంలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్

గాంధీ మెడికల్ కాలేజీలో జెండా వందనం

స్వాతంత్ర పోరాట యోధులకు నివాళులర్పించిన ఆర్య సమాజ్ ప్రతినిధులు
.jpg)
బోయిగూడలో ఘనంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్

గోదావరి నది నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయన ఇద్దరు పోలీస్ అధికారులు

ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

తెలంగాణ జాగృతి అనుబంధ విభాగాలు, జిల్లా అధ్యక్షుల నియామకం
.jpg)
కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ సతీమణి కన్నుమూత

గోదావరి నదిని సందర్శించిన జిల్లా కలెక్టర్,

జిల్లా బీజేపీ ప్రధానకార్యదర్శి గా వడ్డేపల్లి శ్రీనివాస్

కన్నులపండువగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందడి
